ఇక ఇంటికే పెట్రోల్, డీజిల్‌!Fri,April 21, 2017 04:48 PM

Government plans home delivery of petroleum products, says Oil Ministry

న్యూఢిల్లీ: పెట్రోల్ స్టేష‌న్ల ద‌గ్గ‌ర పెద్ద పెద్ద క్యూల‌తో విసుగెత్తి పోయారా? మీకు ఆ చింత లేకుండా చేయ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం ఓ వినూత్న ఆలోచ‌న చేస్తున్నది. ముందుగానే బుక్ చేసుకుంటే పెట్రోల్‌, డీజిల్‌లాంటి పెట్రోలియం ఉత్ప‌త్తుల‌ను ఇంటికే తెచ్చి ఇవ్వాల‌న్న ఆలోచ‌న ఉన్న‌ట్లు కేంద్ర చ‌మురు వ‌న‌రుల శాఖ శుక్ర‌వారం ఓ ట్వీట్ చేసింది. ప్ర‌తి రోజూ దేశ‌వ్యాప్తంగా 3.5 కోట్ల మంది పెట్రోల్ స్టేష‌న్ల‌కు వ‌స్తున్నారు. ప్ర‌తి ఏడాది వీటిల్లో రూ. 2500 కోట్ల లావాదేవీలు న‌డుస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఇంటికే పెట్రోలియం ఉత్ప‌త్తులు తీసుకురావ‌డ‌మ‌న్న వినూత్న ఆలోచ‌న‌కు కేంద్రం శ్రీకారం చుట్ట‌డం ఆహ్వానించ‌ద‌గిన‌దే.
1248
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS