పీఎఫ్, చిన్న పొదుపు మొత్తాలపై వడ్డీ రేట్లు పెంపు

Thu,September 20, 2018 04:04 PM

Government increases interest rates on PPF and Small Savings schemes

న్యూఢిల్లీ: చిన్న పొదుపు మొత్తాలు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌లపై వడ్డీ రేట్లు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెంచిన వడ్డీ రేట్లు ఈ ఏడాది అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి వర్తిస్తాయి. జులై-సెప్టెంబర్ త్రైమాసికానికి చిన్న పొదుపు మొత్తాలు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌పై ఉన్న 7.6 శాతం వడ్డీరేటు ఇక 8 శాతానికి పెరగనుంది. 30 నెలల తర్వాత వీటిపై తొలిసారి ప్రభుత్వం వడ్డీరేట్లు పెంచడం విశేషం. ఇక సీనియర్ సిటిజన్ల ఐదేళ్ల పొదుపు మొత్తాలపై ఇప్పటివరకు 8.3 శాతం వడ్డీ ఇస్తుండగా.. ఇక నుంచి అది 8.7 శాతానికి చేరనుంది. మరోవైపు సుకన్య సమృద్ధి యోజనపై వడ్డీరేట్లు పెంచారు. దీనిపై 8.5 శాతం వడ్డీ రానుంది.

అటు ఐదేళ్ల నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్లపై 8 శాతం, ఐదేళ్ల కాలానికి ఉన్న డిపాజిట్లపై 7.8 శాతం వడ్డీరేటు చెల్లించనున్నారు. ఈ చిన్న పొదుపు మొత్తాలపై వడ్డీరేట్లు పెంచడం వల్ల బ్యాంకుల్లో డిపాజిట్లు భారీగా పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తున్నది. ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఐదేళ్ల డిపాజిట్‌పై 6.85 శాతం వడ్డీ మాత్రమే వస్తున్నది. ఇక నుంచి అది 7.8 శాతం కానుంది. 2016, ఏప్రిల్ 1 నుంచి చిన్న పొదుపు మొత్తాలపై మూడు నెలలకోసారి వడ్డీరేట్లను సవరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

2070
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS