రాఫేల్ డీల్‌.. కొన్ని నిబంధ‌న‌ల‌ను ఎత్తేశారు !

Mon,February 11, 2019 01:44 PM

Government dropped anti corruption conditions in Rafale deal

హైద‌రాబాద్: రాఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు స‌క్ర‌మ ప‌ద్ధ‌తిలో జ‌ర‌గ‌లేద‌ని ఇప్ప‌టికే ఆంగ్ల దిన‌ప‌త్రిక ద హిందూ త‌న క‌థ‌నంలో వెల్ల‌డించిన‌ విష‌యం తెలిసిందే. అయితే ఇవాళ కూడా ఆ ప‌త్రిక రాఫేల్ విమానాల కొనుగోలులో జ‌రిగిన మ‌రో త‌ప్పుడు ప‌ద్ధ‌తిని బ‌హిర్గ‌తం చేసింది. రాఫేల్ కొనుగోలు కోసం ప్ర‌భుత్వం కొన్ని నిబంధ‌న‌ల‌ను ఎత్తివేసిన‌ట్లు ఆ ప‌త్రిక తన రిపోర్ట్‌లో తేల్చింది. డీల్ జ‌ర‌గడానికి కొన్ని రోజుల ముందు.. అవినీతి ద‌ర్యాప్తుకు సంబంధించిన క్లాజ్‌ను తొల‌గించిన‌ట్లు హిందూ ప‌త్రిక పేర్కొన్న‌ది. అంతే కాకుండా భారీ రాయితీలు కూడా ఇచ్చిన‌ట్లు తెలిపింది. ర‌క్ష‌ణ‌శాఖ అభ్యంత‌రం వ్య‌క్తం చేసినా.. ప్ర‌ధాన‌మంత్రి కార్యాల‌యం రాఫేల్ డీల్ కోసం దొడ్డిదారిలో సంప్ర‌దింపులు చేసిన‌ విష‌యం తెలిసిందే. రాఫేల్ అంశంలో ఎటువంటి అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగినా వాటిని విచారించ‌కూడ‌దన్న ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. డీల్‌పై సంత‌కం జ‌ర‌గడానికి కొన్ని రోజుల ముందు ఈ ఘ‌ట‌న జ‌రిగింది. యాంటీ క‌రప్ష‌న్ క్లాజ్‌ను ఎందుకు ఎత్తివేసార‌ని ప‌త్రిక ప్ర‌శ్నించింది.

750
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles