గోరఖ్‌పూర్.. వైద్య కళాశాల ప్రిన్సిపాల్ సస్పెండ్



Sat,August 12, 2017 08:04 PM
గోరఖ్‌పూర్.. వైద్య కళాశాల ప్రిన్సిపాల్ సస్పెండ్

లక్నో : గోరఖ్‌పూర్‌లోని బాబా రాఘవ్ దాస్ మెడికల్ కళాశాల(బీఆర్‌డీఎంసీ) ప్రిన్సిపాల్‌ను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ప్రిన్సిపాల్ నిర్లక్ష్యం వహించడం వల్లే ఐదు రోజుల్లో 63 మంది చిన్నారులు చనిపోయినట్లు అధికారులు భావిస్తున్నారు. యూపీ మెడికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అశుతోష్ టాండన్ ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సిద్ధార్థ్‌నాథ్ సింగ్‌తో చిన్నారుల మృతిపై చర్చించారు. అనంతరం ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు మెడికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రకటించారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణ కొనసాగుతోందని స్పష్టం చేశారు. ఈ ఘ‌ట‌న ప‌ట్ల స‌మ‌గ్ర విచార‌ణ చేప‌ట్టి త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సీఎం ఆదిత్య‌నాథ్ ఆరోగ్య శాఖ అధికారుల‌కు ఆదేశించారు.

454
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS