విక్రమ్ సారాభాయ్‌ జయంతి.. గూగుల్ ప్రత్యేక డూడుల్

Mon,August 12, 2019 10:25 AM

Google Doodle Honours ISRO Founder Vikram Sarabhai

హైదరాబాద్: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ పితామహుడు విక్రమ్ సారాభాయ్ 100వ జయంతి నేడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని విక్రమ్ సారాభాయ్ గౌరవార్ధం గూగుల్ ప్రత్యేక డూడుల్‌ను రూపొందించి ఘన నివాళి అర్పించింది. భౌతికశాస్త్రవేత్త, పారిశ్రామికవేత్త, ఆవిష్కర్త విక్రమ్ సారాభాయ్ ఇస్రోను స్థాపించిన విషయం తెలిసిందే. 12 ఆగస్టు,1919లో అహ్మదాబాద్‌లో జన్మించిన విక్రమ్ సారాభాయ్ 30 డిసెంబర్,1971న తిరువనంతపురంలో తుదిశ్వాస విడిచారు. కేంబ్రిడ్జి యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకుని భారత్‌కు తిరిగి వచ్చారు. 28 ఏళ్ల వయస్సులో అహ్మదాబాద్‌లో ఫిజికల్ రీసెర్చ్ లాబోరేటరీ(పీఆర్‌ఎల్)ను స్ధాపించారు. రష్యా స్ఫూత్నిక్ లాంచ్ తర్వాత అంతరిక్ష పరిశోధనల ప్రాముఖ్యత గురించి, మనిషి, సమాజం ఎదుర్కొనే సమస్యలకు నిజమైన పరిష్కార మార్గాలకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంపై విక్రమ్ సారాభాయ్ భారత ప్రభుత్వానికి వివరించారు. భారత అణు పితామహుడు డాక్టర్ హోమీ బాబా సంపూర్ణ మద్దతుతో భారత్‌లో మొదటి రాకెట్ లాంచింగ్ స్టేషన్‌ను విక్రమ్ సారాభాయ్ స్థాపించారు. 21నవంబర్, 1963న సోడియం వేపర్ పేలోడ్‌ను ప్రారంభ ప్రయోగంగా చేపట్టారు. ఇస్రో ఇటీవల చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగంలో విక్రమ్ ల్యాండర్ సెప్టెంబర్ 7న చంద్రుని ఉపరితలాన్ని తాకనుంది.

761
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles