మాదే పొరపాటు.. క్షమాపణలు చెప్పిన గూగుల్

Sat,August 4, 2018 07:12 AM

Google admits fault for coding UIDAI helpline into Android mobile phones

న్యూఢిల్లీ: ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్ల కాంటాక్ట్ లిస్టులో ఎవరి ప్రమేయం లేకుండా ఓ కొత్త ఫోన్ నెంబర్ జతచేరిన విషయం తెలిసిందే. ఆ నెంబర్ వేలాది ఫోన్లలో శుక్రవారం కనిపించింది. దీంతో కస్టమర్లు ఆందోళనకు గురయ్యారు. అది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా టోల్‌ఫ్రీ నెంబర్. నెంబర్‌ను ఫోన్‌లో సేవ్ చేయకుండానే కాంటాక్ట్ లిస్టులోకి ఎలా వచ్చిందా అని ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు టెన్షన్ పడ్డారు. ఓ వ్యక్తి తన కాంటాక్ట్ లిస్టును స్క్రీన్‌షాట్ తీసి ఈ విషయాన్ని ట్వీట్ చేశారు. దీంతో ఈ వార్త వెలుగులోకి వచ్చింది. అయితే ఈ సంఘటనపై గూగుల్ సంస్థ స్పందించింది. ఆ పొరపాటు మాదే అని ఆ సంస్థ అంగీకరించింది. ఆ ఘటన పట్ల గూగుల్ క్షమాపణలు కూడా చెప్పింది. స్మార్ట్‌ఫోన్లలో యూఐడిఏఐ నెంబర్ అనుకోకుండా వచ్చి చేరిందని గూగుల్ సంస్థ వెల్లడించింది. అయితే ఫోన్ యూజర్లలోకి ఎవరూ అక్రమంగా చొరబడలేదని ఆ సంస్థ స్పష్టం చేసింది. ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్‌లోని సెటప్ విజార్డ్‌లో.. హెల్ప్‌లైన్ నెంబర్ అప్రమేయంగా కోడ్ అయినట్లు సంస్థ తెలిపింది. యూజర్లు ఆ నెంబర్‌ను డిలీట్ చేయవచ్చు అని గూగుల్ సంస్థ వెల్లడించింది.

4369
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles