జీఎస్టీతో ధ‌ర‌లు త‌గ్గే వ‌స్తువులు ఇవే..

Fri,May 19, 2017 12:10 PM

Goods getting cheaper with the implementation of GST

న్యూఢిల్లీ: కొత్త‌గా రానున్న ప‌రోక్ష ప‌న్నుల విధానం జీఎస్టీ (గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్‌)తో నిత్యావ‌స‌ర వ‌స్తువుల ధ‌ర‌లు త‌గ్గ‌నున్నాయి. దేశంలోని ఎక్కువ‌గా ఉండే మ‌ధ్య‌, దిగువ మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబాల‌కు ఇది ఒక‌ర‌కంగా శుభ‌వార్తే. రోజువారీ అవ‌స‌ర‌మ‌య్యే బియ్యం, ప‌ప్పు ధాన్యాలు, పాలు, పెరుగులాంటి వస్తువుల రేట్లు జీఎస్టీతో త‌గ్గ‌నున్నాయి. ఇక నూనెలు, స్వీట్లు, చ‌క్కెర‌, కాఫీ, టీ పొడుల‌ను కూడా అతి త‌క్కువ ప‌న్ను స్లాబులో చేర్చ‌డంతో వీటి ధ‌ర‌లు కూడా దిగి రానున్నాయి. జులై 1 నుంచి జీఎస్టీ అమ‌ల్లోకి రానున్న విష‌యం తెలిసిందే. మొత్తంగా 1211 వ‌స్తువుల్లో ఏడు శాతం వాటిపై అస‌లు ప‌న్నే ఉండ‌దు.

- వీటిలో బియ్యం, గోధుమ‌లు, ఇత‌ర ఆహార ప‌దార్థాలు ఉన్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు కొన్ని రాష్ట్రాలు వీటిపై వ్యాట్ విధిస్తుండ‌గా.. ఇప్పుడు అది కూడా ఉండ‌క‌పోవ‌డం వ‌ల్ల వీటి ధ‌ర‌లు త‌గ్గుతాయి.
- పాలు, పెరుగుపై కూడా ఎలాంటి ప‌న్ను ఉండ‌దు
- ఇక చ‌క్కెర‌, టీ, కాఫీ, మిఠాయిల‌ను అతి త‌క్కువ ప‌న్ను శ్లాబు 5 శాతం ప‌రిధిలోకి తీసుకురావ‌డంతో వీటి ధ‌ర‌లు ఓ మోస్త‌రుగా త‌గ్గుతాయి. ప్ర‌స్తుతం వీటిపై 4 నుంచి 6 శాతం ప‌న్నులు వ‌సూలు చేస్తున్నారు
- అటు రోజువారీ వాడే త‌ల నూనె, స‌బ్బులు, టూత్ పేస్టుల‌పై గ‌తంలో ఉన్న 22-24 శాతం ప‌న్ను.. జీఎస్టీతో 18 శాతానికి ప‌రిమితం కానుంది. ఈ ర‌కంగా వీటి ధ‌ర‌లు కూడా త‌గ్గుతాయి

3407
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS