సుపరిపాలన, అభివృద్ధే గెలిపించాయి : ప్రధాని మోదీ

Mon,December 18, 2017 03:51 PM

Good governance, development gave victory in Gujarat, Himachal states, says PM Modi

న్యూఢిల్లీ: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ విక్టరీ సాధించింది. సుపరిపాలన, అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టారని ప్రధాని మోదీ అన్నారు. రెండు రాష్ర్టాల ఎన్నికల ఫలితాలు ఇదే రుజువు చేస్తున్నాయని ఆయన అన్నారు. ఎన్నికల ఫలితాలపై ఇవాళ మోదీ ట్వీట్ చేశారు. రెండు రాష్ర్టాల్లో బీజేపీ గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తలకు ఆయన సెల్యూట్ చేశారు. కార్యకర్తల వల్లే ఆ రాష్ర్టాల్లో విజయదుందుబీ మోగించినట్లు ఆయన చెప్పారు. బీజేపీ పట్ల గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు ఉన్న నమ్మకానికి తాను శిరసు వంచి నమస్కరిస్తున్నట్లు మోదీ తెలిపారు. రెండు రాష్ర్టాలను అభివృద్ధిపథంలో నడిపిస్తామని, నిరంతంరంగా సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు మోదీ ట్వీట్ చేశారు. వికాసం గెలిచింది, గుజరాత్ గెలిచిందని కూడా మోదీ ట్వీట్ చేశారు.2119
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles