కడపలో భారీగా బంగారం స్వాధీనం

Thu,September 19, 2019 08:27 PM

కడప : ప్రొద్దుటూరులో పెద్ద ఎత్తున బంగారం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. బిల్లులు లేకుండా తరలిస్తున్న 2.262 కిలోల బంగారు నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రతన్ సింగ్ అనే వ్యక్తి బంగారు నగలతో బెంగళూరు నుంచి ప్రొద్దుటూరు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ప్రొద్దుటూరులో వాహనాలు తనిఖీ చేస్తుండగా బంగారం పట్టుబడింది. పట్టుబడిన నగల విలువ రూ. 70 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. నగలను వాణిజ్య పన్నుల అధికారులకు పోలీసులు అప్పగించనున్నారు.

2143
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles