గోవా సీఎం రేసులో ప్ర‌మోద్ సావంత్ !

Mon,March 18, 2019 12:22 PM

Goa Speaker Pramod Sawant frontrunner for CM post

హైద‌రాబాద్ : గోవా సీఎం రేసులో ఆ రాష్ట్ర స్పీక‌ర్ ప్ర‌మోద్ పాండురంగ సావంత్ ఉన్న‌ట్లు తెలుస్తోంది. సీఎం మ‌నోహ‌ర్ పారిక‌ర్‌.. ఆదివారం తుదిశ్వాస విడ‌వ‌డంతో.. ఆ ప‌ద‌వి కోసం ఇప్పుడ‌క్క‌డ చ‌ర్చ జ‌ర‌గుతోంది. గోవాలో మొత్తం 40 స్థానాలు ఉన్నాయి. కానీ అందులో ఇప్పుడు 36 మంది ఎమ్మెల్యేలు మాత్ర‌మే ఉన్నారు. పారిక‌ర్‌తో పాటు ఇటీవ‌ల మ‌రో బీజేపీ నేత ఫ్రాన్సిస్ డిసౌజా మృతిచెందారు. ఇద్ద‌రు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. అయితే ప్ర‌మోద్ సావంత్ రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు. 2017, మార్చ్ 22న ఆయ‌న స్పీక‌ర్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఎంజీపీ పార్టీతో పొత్తుపెట్టుకున్న బీజేపీ.. గోవాలో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే. ఈ టీమ్‌లో గోవా ఫార్వ‌ర్డ్ పార్టీ, స్వ‌తంత్రులు కూడా క‌లిశారు. గోవాలో 19 సీట్లు ఉంటే మెజారిటీ నిరూపించుకోవ‌చ్చు. అయితే కాంగ్రెస్‌కు 14 సీట్లు ఉన్నాయి. మ‌రోవైపు బీజేపీకి 12 సీట్లే ఉన్నాయి. ఇక ఎంజీపీకి మూడు, జీపీఎఫ్‌కు మూడు, ఎన్సీపీ ఖాతాలో ఒక సీటు ఉంది. ముగ్గురు ఇండిపెంట్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్ర‌స్తుతం బీజేపీ .. ఎంజీపీ, జీఎఫ్‌పీ, స్వ‌తంత్రుల మ‌ద్ద‌తు తీసుకుని ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇవాళ సాయంత్రం పారిక‌ర్ పార్ధీవ‌దేహానికి అంత్య‌క్రియ‌లు నిర్వ‌హిస్తారు. తుది వీడ్కోలు ప‌లికేందుకు ప్ర‌ధాని మోదీ కాసేప‌ట్లో ప‌నాజీ చేరుకోనున్నారు.

1911
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles