ధూమపానం మానేందుకు గమ్‌ను తీసుకువచ్చిన గ్లెన్‌మార్క్

Thu,November 23, 2017 10:24 PM

Glenmark Pharmaceuticals launches nicotine gum Kwitz

హైదరాబాద్: పొగత్రాగే అలవాటును మాన్పించేందుకు క్విట్జ్ థెరఫీ పేరుతో గమ్‌ను ప్రవేశపెట్టినట్లు గ్లెన్‌మార్క్ ఫార్మాసుటికల్ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. క్విట్జ్ నికోటిన్ రిప్లేస్‌మెంట్ థెరపీగా దీనికి నామకరణం చేశామని పేర్కొంటూ ఈ గమ్‌ను వినియోగించేవారికి క్రమేపీ సిగరెట్లు కాల్చలనే ఆలోచన తగ్గుతుందని ఆ సంస్థ అధ్యక్షుడు సుజేష్ వాసుదేవన్ తెలిపారు. నికోటిన్ రిప్లేస్‌మెంట్ థెరపీని ప్రయోగాత్మకంగా అమలు చేసి చూశామని వైద్య నిబంధనలకు అనుగుణంగా ఈ ఉత్పత్తులను విడుదల చేస్తున్నామని తెలిపారు. రోజుకు 20 కంటే ఎక్కువ సిగరెట్లు కాల్చేవారి కోసం క్విట్జ్ 4ఎంజీ గమన్‌ను రూపొందించినట్లు ఆయన వెల్లడించారు. ప్రపంచఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం ప్రపంచంలో ఏటా ఆరు మిలియన్ల మంది పొగాకు వల్ల మరణిస్తున్నారని అధ్యయనాల్లో తేలిందన్నారు.

1398
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS