దుర్గామాతకు తన కండ్ల‌నే కానుక‌గా స‌మ‌ర్పించింది!

Sun,March 25, 2018 06:16 PM

Girl takes out her eyes and offers them to Goddess Durga in Bihar

పాట్నా: దుర్గామాత అంటే ఎంత పవర్‌ఫుల్ అమ్మవారో అందరికీ తెలుసు. సాధారణంగా దుర్గామాతకు చీరెలు, గాజులు, కుంకుమభరిణె కానుకగా సమర్పిస్తారు. కాని.. ఓ 16 ఏండ్ల అమ్మాయి మాత్రం తన కండ్లనే దుర్గామాతకు కానుకగా సమర్పించింది. వినడానికి ఆశ్చర్యంగా, వింతగా, కొత్తగా, భయంకరంగా అనిపించినప్పటికీ ఇది అక్షరాలా నిజం. వివరాల్లోకి వెళ్తే...

అది బీహార్ రాజధాని పాట్నాకు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న దర్భంగా జిల్లా బహేరిలోని సిరువా గ్రామం. అక్కడ ఉన్న దుర్గామాత టెంపుల్‌కు ఓ ఫ్యామిలీ వెళ్లింది. ఆ టెంపుల్‌లో దుర్గామాత ఉత్సవాలు జరుగుతున్నాయి. చైత్ర నవరాత్ర ఉత్సావాల్లో ఏడో రోజును అక్కడ ఘనంగా జరుపుతున్నారు. ఆ ఫ్యామిలీ కూడా దుర్గామాతను దర్శించుకుంటున్నది. టెంపుల్‌లో చుట్టూ జనాలు... దుర్గామాత దర్శనం కోసం పోటెత్తారు. ఆ ఫ్యామిలీకే చెందిన ఓ అమ్మాయి అక్కడ ఉన్న భక్తులతో మాట్లాడుతూ.. దుర్గామాతకు కండ్లను సమర్పించవచ్చా అని అడిగింది. అలా అడిగిన క్షణంలోనే తన చేతి వేళ్లతోనే తన రెండు కండ్లను పీకింది. ఈ ఘటనను గమనించిన భక్తులంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఆ అమ్మాయిని బహేరి ప్రైమరీ హెల్త్ సెంటర్‌కు తరలించి ప్రాథమిక చికిత్స చేయించారు. తర్వాత దర్భంగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆ అమ్మాయి పరిస్థితి విషమంగానే ఉన్నట్లు సమాచారం.

"సంప్రదాయం ప్రకారం.. ఉత్సవాల్లోని ఏడో రోజున దుర్గామాతకు గోల్డెన్ యాపిల్ బేర్ విత్తనాలతో చేసిన కండ్లను కానుకగా సమర్పిస్తుంటారు. కాని.. తమ కండ్లను ఎవరూ అర్పించరు. ఒకవేళ ఆ అమ్మాయి ఏదైనా మానసిక సమస్యలతో బాధపడుతుండవచ్చు.." అని దుర్గామాత టెంపుల్ పూజారి భావ్‌నాత్ ఝా తెలిపారు.

"తన చేతి వేళ్లతోనే తన రెండు కండ్లను బయటికి లాగింది. తన చేతి వేళ్లు బలంగా కండ్లకు తాకడం వల్ల కంటి గుడ్లు బాగా దెబ్బతిన్నాయి. మా శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం. తనకు కంటి చూపు మళ్లీ వస్తుందా లేదా అనేది ఇప్పుడే చెప్పలేం. అయితే.. ఆ అమ్మాయి ఎందుకు ఇలా ప్రవర్తించిందో అర్థం కావట్లేదు.. ఆ అమ్మాయి ఫ్యామిలీ మెంబర్స్‌తోనూ మాట్లాడాను. తను ఎటువంటి మానసిక సమస్యలతో బాధపడట్లేదు. నార్మల్ అమ్మాయే.. ఎందుకు ఇలా చేసిందో తమకూ అర్థం కావట్లేదంటూ అమ్మాయి తల్లిదండ్రులు చెప్పినట్లు తనకు ట్రీట్‌మెంట్ ఇస్తున్న డాక్టర్ తెలిపాడు.

5189
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS