రంకెలేసిన ఆవు.. తమ్మున్ని కాపాడిన చిన్నారి - వీడియో

Fri,February 16, 2018 10:24 AM

girl saves his brother from raging cow in karnataka

బెంగుళూరు: సమయస్ఫూర్తితో ఓ చిన్నారి.. తన తమ్మున్ని కాపాడింది. 8 ఏళ్ల ఆర్తి.. అత్యంత ధైర్యసాహాసం ప్రదర్శించి.. 4 ఏళ్ల తన తమ్ముడిని ఓ ఆవు నుంచి రక్షించింది. టాయ్ కారులో తమ్ముడు కార్తిక్‌ను ఆడిస్తున్న సమయంలో ఓ ఆవు రంకెలు వేస్తూ దూసుకువచ్చింది. అది గమనించిన ఆ చిన్నారి .. తన తమ్మున్ని ఆ ఆవు దాడి నుంచి కాపాడుకునేందుకు ప్రయత్నించింది. ఆడుకుంటున్న ఇద్దరు పిల్లల మీదకు వేగంగా దూసుకెళ్లిన ఆవు.. వాళ్లను పొడిచేందుకు ప్రయత్నించింది. అయినా ఆర్తి మాత్రం తన తమ్ముడిని వదలలేదు. ఆ ఘటన సీసీటీవీకి చిక్కింది. ఉత్తర కన్నడ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఇదే ఆ వీడియో.

4896
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles