మాకు ఐదు జిరాఫీలు కావాలి..

Wed,June 19, 2019 07:30 PM


Giraffe less Delhi Zoo hopes to acquire animal from Thailand


న్యూఢిల్లీ: ఢిల్లీలోని నేషనల్ జువాలాజికల్ పార్కు (ఎన్‌జెడ్‌పీ)ఢిల్లీ జూగా అందరికీ తెలుసు. ప్రఖ్యాతిగాంచిన ఈ జూలో ఇపుడు జిరాఫీలే లేకుండా పోయాయి. గతంలో ఢిల్లీ జూలో అంకిత్ అనే ఎనిమిదేళ్ల వయస్సున్న ఒకే ఒక్క జిరాఫీ ఉండగా..అది 2015లో గుండెజబ్బు, కిడ్నీ ఫెయిల్యూర్‌తో చనిపోయింది. దీంతో జూలో జిరాఫీయే లేకుండా పోయింది. జూ అధికారులు అప్పటి నుంచి తమకు ఐదు జిరాఫీలు కావాలని వివిధ జూలకు లేఖలు రాస్తూనే ఉన్నారు.

ఈ విషయమై ఎన్‌జెడ్‌పీ డైరెక్టర్ రేణూ సింగ్ మాట్లాడుతూ..నేను ఇక్కడ రెండేళ్లుగా పనిచేస్తున్నా. ఇప్పటివరకు జిరాఫీలు కావాలని పాట్నా, మైసూరు, కోల్‌కతా జూ అధికారులకు లేఖలు రాశాం. అయితే జిరాఫీలు పునరుత్పత్తి తర్వాత తప్పకుండా అందజేస్తామని వారు చెప్పారు. ప్రస్తుతం థాయ్ లాండ్ లో 24 జిరాఫీలున్నాయి. ఈ మేరకు చియాంగ్ మే నైట్ సఫారీ, ఖావో ఖేవో జూతోపాటు మరో జూకు కూడా లేఖ రాశారు. జంతు మార్పిడి కార్యక్రమం కింద తమకు ఐదు జిరాఫీలు ఇవ్వాలని కోరామని, తమ ప్రయత్నం ఫలిస్తుందన్న నమ్మకముందని రేణూ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

2144
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles