కోల్‌కతాలో భారీ చందమామSun,February 18, 2018 04:46 PM

కోల్‌కతాలో భారీ చందమామ

కోల్‌కతాః చందమామ నేలపైకి దిగొచ్చింది. కోల్‌కతాలోని విక్టోరియా మెమొరియల్ దగ్గర కొలువుదీరింది. చందమామ భారీ 3 డీ ఆకారాన్ని చూడటానికి అక్కడి ప్రజలు క్యూ కడుతున్నారు. నాసా కెమెరా సాయంతో తీసిన చంద్రుడి చిత్రానికి ఇది నకలు. సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో బ్రిటిస్ కౌన్సిల్ ఈ మ్యూజియం ఆఫ్ ద మూన్ ప్రాజెక్ట్‌ను చేపట్టింది. విక్టోరియా మహల్ నార్త్ గేట్ దగ్గర ఈ భారీ చంద్రుడిని ఏర్పాటుచేశారు. ఈ మ్యూజియం ఆఫ్ మూన్ ప్రాజెక్ట్ ఇప్పటికే బెంగళూరు, ముంబై, ఉదయ్‌పూర్ నగరాలను తిరిగొచ్చింది. బ్రిటిష్ ఆర్టిస్ట్ ల్యూక్ జెరామ్ దీనిని రూపొందించారు. దీని ఎత్తు 23 అడుగులు కావడం విశేషం. అయితే అసలు చంద్రుడి కన్నా ఇది ఐదు లక్షల రెట్లు చిన్నగా ఉంది. యువతలో ఖగోళశాస్త్రంపై ఆసక్తి కలిగించేందుకు ఈ ప్రదర్శన ఏర్పాటుచేస్తున్నారు.

2650
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS