దేశద్రోహులు.. గులాం నబీ ఆజాద్, సైఫుద్దిన్

Fri,June 29, 2018 04:22 PM

Ghulam Nabi Azad, Saifuddin Soz booked for making seditious remarks against Army

న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేతలు గులామ్ నబీ ఆజాద్, సైఫుద్దిన్ సోజ్‌లపై ఢిల్లీ హైకోర్టులో ఫిర్యాదు నమోదైంది. భారతీయ సైన్యంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆ ఇద్దరి నేతలపై రాజద్రోహం కింద కేసును రిజిస్టర్ చేశారు. పాటియాలా హౌజ్ కోర్టులో అడ్వకేట్ శశి భూషణ్ ఆ ఫిర్యాదును నమోదు చేశారు. జమ్మూకశ్మీర్‌లో ఆర్మీ నిర్వహిస్తున్న ఆపరేషన్ల వల్ల ఉగ్రవాదుల కన్నా.. సాధారణ ప్రజలే ఎక్కువగా మరణిస్తున్నారని ఆజాద్ ఇటీవల విమర్శలు చేశారు. అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆజాద్‌పై 124, 120బీ, 505(1) ఐపీసీ సెక్షన్ల కింద చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. శనివారం మెజస్ట్రేట్ కోర్టు ముందు ఈ కేసు విచారణుకు రానున్నది.

1447
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles