కాంగ్రెస్‌కు గౌతం గంభీర్‌ సలహా..

Fri,May 24, 2019 04:58 PM

Gautam Gambhir salutes Narendra Modi's leadership, has an advice for Congress

న్యూఢిల్లీ: భారత మాజీ క్రికెటర్‌, బీజేపీ నేత గౌతం గంభీర్‌ ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంపై ప్రశంసల జల్లు కురిపించారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన గంభీర్‌ తూర్పు ఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. సుమారు 7లక్షలకు పైగా ఓట్లను గంభీర్‌ సాధించాడు. తాను గెలిస్తే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలను చేస్తాననే అంశాలను ఎన్నికల ప్రచారంలో ప్రజల్లోకి తీసుకెళ్లి విజయవంతం అయ్యాడు. దీంతో కాంగ్రెస్‌ అభ్యర్థి అర్విందర్‌ సింగ్‌ లవ్లీ, ఆప్‌ అభ్యర్థి అతిషీలపై భారీ మెజార్టీతో గెలిచాడు. తొలిసారి ఎంపీగా పార్లమెంట్‌లో అడుగుపెట్టేందుకు ఉత్సాహంగా ఉన్నాడు.

ఎన్నికల ఫలితాల అనంతరం గంభీర్‌ శుక్రవారం మాట్లాడుతూ.. ''నాపై పూర్తి విశ్వాసం, నమ్మకం ఉంచిన నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు. గత ఐదేండ్లలో ప్రధాని మోదీ అద్భుత నాయకత్వ ఫలితమే ఈ విజయం. నిజాయతీతో కష్టపడి పనిచేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయనే దానికి ఇది నిదర్శనం. కాంగ్రెస్‌కు ఓ సలహా ఇవ్వాలనుకుంటున్నా. ప్రతిసారి ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకొని దాడికి దిగడం కాకుండా ఎక్కడ తప్పుచేశాం.. లోపాలు ఎక్కడ ఉన్నాయనే అంశాలపై కాంగ్రెస్‌ ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఓటమికి గల కారణాలపై సమీక్షించ చేసుకోకపోతే.. వాళ్లు ఎప్పటికీ అధికారంలో రాలేరని నేను రాతపూర్వకంగా రాసి ఇవ్వగలను.'' అని వ్యాఖ్యానించారు.

త్వరలో ప్రపంచకప్‌ ఆరంభంకానున్న నేపథ్యంలో టీమిండియాకు గంభీర్‌ శుభాకాంక్షలు తెలిపారు. 'ఓ క్రికెటర్‌ జీవితంలో ప్రపంచకప్‌లో గెలవడం కన్నా పెద్ద ఆనందం ఏమీ ఉండదు. 2011 టోర్నీలో విజేతగా నిలిచాం.. 2019 ప్రపంచకప్‌లో మరోసారి గెలిచేందుకు ఓ గొప్ప అవకాశం మన ముందుంద'ని గంభీర్‌ పేర్కొన్నారు.

4184
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles