తాలిపేరు ప్రాజెక్టుకు నాలుగు గేట్లు ఎత్తివేత

Sun,August 25, 2019 10:04 PM

Gates Lifted At Taliperu Project To Release Flood Water

భద్రాద్రి కొత్తగూడెం: తాలిపేరు ప్రాజెక్టులోకి ఆదివారం భారీగా వరద నీరు చేరడంతో ప్రాజెక్టు అధికారులు నాలుగు గేట్లు ఎత్తి 12,560 క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేశారు. ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 74 అడుగులు కాగా 73.23 మీటర్ల నీటిని నిల్వచేసి అదనపు నీటిని గేట్లు ఎత్తి వదిలేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు ప్రధాన ఎడమ, కుడి కాలువల ద్వారా పంట పొలాలకు 140 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. భద్రాచలం వద్ద ఆదివారం ఉదయం ఆరు గంటలకు 32.7 అడుగులుగా ఉన్న గోదావరి ప్రవాహం మధ్యాహ్నం 12 గంటలకు ఒక అడుగు తగ్గింది. వరద ప్రవాహం సాధారణంగానే ఉందని సీడబ్ల్యూసీ అధికారులు తెలిపారు.

738
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles