మరో మూడు నెలల్లో గంగానదీ ప్రక్షాళన: నితిన్ గడ్కరీ

Fri,December 28, 2018 11:22 AM

Ganga river Will be in 3 Months says Nitin Gadkari

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది మార్చి నెల నాటికి గంగా నది 70 నుంచి 80 శాతం వరకు అదేవిధంగా మార్చి 2020 వరకు పూర్తిగా 100 శాతం ప్రక్షాళన అవుతుందని కేంద్ర జలవనరులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో గడ్కరీ నేడు 11 అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. నమామి గంగే కార్యక్రమంలో భాగంగా యమునా నది పునరుద్ధరణ(ఢిల్లీ పరిధిలో 22 కిలోమీటర్ల మేర) పనులకు కేంద్ర మంత్రి నేడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. గంగా నదీ ప్రక్షాళనకు దాదాపు 26 వేల కోట్లు వెచ్చించినట్లు తెలిపారు. గంగా నదీ ప్రక్షాళన పూర్తి అవుతుందన్న విశ్వాసం తనకుందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. హరిద్వార్, ఉన్నావ్ పరిధిలో గల నీరు త్రాగడానికి కాదు సరికదా కనీసం స్నానం చేయడానికి కూడా పనికిరాదని గ్రీన్ ట్రిబ్యూనల్ కోర్టు పేర్కొంది. మరోవైపు గంగానదీ ప్రక్షాళన కోరుతూ పలువురు సాధువులు ఇప్పటికే ఆమరణ నిరాహార దీక్ష చేబూని తనువులు చాలిస్తున్న విషయం తెలిసిందే.

763
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles