'ప్లాస్టిక్‌ను బ్యాన్ చేద్దాం, సముద్రాన్ని కాపాడుదాం' థీమ్‌తో గణేశ్ మండపం

Fri,September 21, 2018 04:53 PM

Ganesh Pandal In Thane Highlights Save Oceans, Stop Reckless Plastic Use

ప్లాస్టిక్ భూతమే ఇప్పుడు ప్రపంచం ముందున్న అతిపెద్ద సవాల్. ప్లాస్టిక్ వల్ల ఎన్ని అనర్థాలో అందరికీ తెలుసు. కానీ.. ఎవ్వరూ ప్లాస్టిక్ వాడకుండా ఉండలేరు. ప్లాస్టిక్ బ్యాగ్స్ మనిషి జీవితంలో భాగం అయిపోయాయి. దాంతో పాటు ప్రతి దాంట్లోనూ ప్లాస్టిక్ కలుస్తోంది. చివరకు వినాయకుడి విగ్రహానికి కూడా ప్లాస్టిక్ కోటింగ్ వేస్తుండటంతో గణేశ్ విగ్రహాలను సముద్రాల్లో నిమజ్జనం చేయడం వల్ల ఎన్నో సమస్యలు వస్తున్నాయి. ఈ ప్లాస్టిక్ భూతాన్ని రూపుమాపడం ఎలా? ఎలా? అంటే మార్పు మననుంచే మొదలవ్వాలి.. అన్న ఉద్దేశంతో ముంబై సమీపంలోని థానెలో గణపతి పండల్‌ను సముద్రం థీమ్‌తో అలంకరించారు. ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టి సముద్రాన్ని కాపాడుకుందాం.. అన్న క్యాప్సన్‌తో థీమ్‌ను ఏర్పాటు చేశారు వాళ్లు. ప్రతి సంవత్సరం శ్రీరంగ్ సహనివాస్ గణేశోత్సవ్ మండల్ వాళ్లు ఏదో ఒక థీమ్‌తో గణేశ్ పండల్‌ను అలంకరిస్తారు. ఏదైనా ప్రజలను మేల్కొలిపే థీమ్‌ను సెలెక్ట్ చేసుకుంటారు వాళ్లు. అలా.. ఈసారి ప్లాస్టిక్ ద్వారా అయ్యే కాలుష్యం వల్ల వచ్చే నష్టాలపై ఇలా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.

ఈ థీమ్‌ను సెట్ చేయడానికి 10 మంది దాదాపు 20 రోజులు కష్టపడ్డారు. అది కూడా తక్కువ ఖర్చుతో అద్భుతమైన గణేశ్ పండల్‌ను తయారు చేశారు. గత 48 సంవత్సరాల నుంచి ఆ గణేశోత్సవ్ మండల్ వాళ్లు వినాయకుడిని ఏర్పాటు చేస్తున్నారు. అప్పటి నుంచి మట్టితో చేసిన విగ్రహాన్నే వాడుతున్నారట. గత 6 ఏండ్ల నుంచి మాత్రం థర్మకోల్, ప్లాస్టిక్ ఉపయోగించడం ఆపేశారట. ఇలా సరికొత్త థీమ్‌తో ఏర్పాటు చేసిన ఈ గణేశ్ పండల్‌ను వీక్షించడానికి రోజుకు 4000 మంది దాకా వస్తున్నారట.

729
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles