రాహుల్ గాంధీ అల్టిమేట్ కామెడీ.. చూసి నవ్వుకోండి..!

Thu,April 18, 2019 03:48 PM

funny conversation cum speech of Rahul Gandhi video goes viral

ఇది ఎన్నికల సీజన్ కదా. కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా గడుపుతున్నారు. అయితే.. రాహుల్ సాధారణంగా హిందీ లేదా ఇంగ్లీష్‌లో మాత్రమే ప్రసంగిస్తారు. హిందీ మాతృ భాష కాని రాష్ర్టాలకు ప్రచారానికి వెళ్లినప్పుడు ఖచ్చితంగా ట్రాన్స్‌లేటర్ ఉంటాడు. రాహుల్ హిందీ లేదా ఇంగ్లీష్‌లో మాట్లాడిన తర్వాత ట్రాన్స్‌లేటర్ ఆ రాష్ట్ర మాతృ భాషలోకి అన్వయిస్తాడు.

ఇటీవల రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేరళ వెళ్లారు. కేరళీయుల మాతృ భాష మలయాళం కదా. ఆ భాష రాహుల్‌కు రాదు కాబట్టి.. రాహుల్ ఇంగ్లీష్‌లో ప్రసంగిస్తుంటే.. ట్రాన్స్‌లేటర్ రాహుల్ ప్రసంగాన్ని మలయాళంలోకి అనువదిస్తున్నాడు. ఆ సమయంలో రాహుల్, ఆ ట్రాన్స్‌లేటర్ మధ్య జరిగిన ఫన్నీ సంభాషణకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాహుల్ గాంధీ ఇంగ్లీష్‌లో మాట్లాడింది ఆ ట్రాన్స్‌లేటర్‌కు అర్థంకాక... మళ్లీ రాహుల్‌ను అడగడం, రాహుల్ ఆయనకు చెవిలో మళ్లీ చెప్పడం, ఇదే మూడు నాలుగు సార్లు రిపీట్ అవ్వడం ఆద్యంతం ఫన్నీగా ఉంది. ఆ వీడియోను చూసి నెటిజన్లు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారు. మీరు కూడా ఈ వీడియోను ఏదో సరదాకు చూసేయండి.


2436
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles