HomeLATEST NEWSFrench former president called Modi as Thief Modi should clarify it says Rahul Gandhi

మోదీ ఓ దొంగ అని ఫ్రెంచ్ మాజీ అధ్యక్షుడు అన్నారు.. దీనిపై ఏమంటారు?

Published: Mon,September 24, 2018 04:50 PM
  Increase Font Size Reset Font Size decrease Font size   

అమేథి: రాఫెల్ డీల్‌పై రోజురోజుకూ ప్రధాని మోదీపై విమర్శల డోసు పెంచుతున్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. తాజాగా అమేథిలో ఆయన మాట్లాడుతూ.. సాక్షాత్తూ ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్.. మోదీ ఓ దొంగ అని అన్నారని, దీనిపై ప్రధాని స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. మోదీ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుంచి కాంట్రాక్ట్‌ను లాక్కొని జన్మలో ఎయిర్‌క్రాఫ్ట తయారు చేయని అనిల్ అంబానీకి ఇచ్చారని విమర్శించారు. మన జవాన్లు దేశం కోసం ప్రాణాలు ఇస్తుంటే.. మోదీ మాత్రం వాళ్ల జేబుల్లోని డబ్బును అనిల్ అంబానీ చేత దొంగతనం చేయించారని తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రతి రోజూ అరుణ్ జైట్లీ నిజం, నిజం అంటుంటారు... జాయింట్ పార్లమెంటరీ కమిటీని వేయండి.. నిజమేంటో తెలుస్తుంది. పెద్ద పెద్ద లెక్చర్లు ఇచ్చే మోదీ అనిల్ అంబానీ గురించి మాత్రం ఏమీ మాట్లాడరు.. ఎందుకంటే మన దేశ కాపలాదారు అనిల్ అంబానీతో చోరీ చేయించారు అని రాహుల్ విమర్శించారు.


2671
Tags

More News

NATIONAL-INTERNATIONAL

SPORTS

Health

Technology