జైషె మహమ్మద్ ఆస్తులను స్తంభింపజేసిన ఫ్రాన్స్

Fri,March 15, 2019 04:53 PM

France freezes jaishe assets

ఉగ్రవాద సంస్థ జైషె మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించేందుకు ఐక్యరాజ్యసమితిలో జరుగుతున్న ప్రయత్నాలకు చైనా గండికొట్టింది. కానీ విడివిడిగా దేశాలు అజర్‌పై చర్యలకు పూనుకుంటున్నాయి. తాజాగా ఫ్రాన్స్ ప్రభుత్వం తన పరిధిలోని జైషె ఆస్తులను స్తంభింపజేసింది. అంతేకాకుండా యూరపియన్ యూనియన్‌లో అజర్‌ను అనుమానిత ఉగ్రవాదుల జాబితాలో చేర్చేందుకు సంప్రదింపులు జరుపుతామని తెలిపింది. ఈమేరకు ఫ్రాన్స్ అంతరంగిక భద్రత, ఆర్థిక, విదేశాంగ శాఖలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. భారత్‌లో ఉగ్రదాడులకు తెగబడుతున్న జైషె వంటి సంస్థలపై ఉక్కుపాదం మోపాలని ప్రపంచంలోని పలుదేశాలు పాకిస్థాన్‌పై వత్తిడి తెస్తున్నాయి. పుల్వామా ఉగ్రదాడి జరిగిన కొన్నిరోజులకే బ్రిటన్, అమెరికాలతో కలిసి ఫ్రాన్స్ ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో అజర్‌పై తీర్మానం ప్రవేశపెట్టింది. అతడిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని ఆ తీర్మానంలో పేర్కొన్నది. కానీ శాశ్వత సభ్యదేశమైన చైనా మోకాలు అడ్డుపెట్టడంతో ఆ తీర్మానం వీగిపోయింది. చైనా తనకు పాకిస్థాన్‌తో గల సంబంధాలు, సొంత ఉగ్రవాద సమ్స్యల కారణంగా ఈ వైఖరి తీసుకున్నదనేది బహిరంగ రహస్యమే. దాంతో విసుగు చెందిన ఫ్రాన్స్ తనవంతుగా జైషె ఆస్తులను స్తంభింపజేయాలని నిర్ణయించుకుంది.

1024
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles