చిత్తూరు ప్ర‌మాదంలో న‌లుగురు స్పెయిన్ దేశ‌స్థులు మృతి

Sat,August 5, 2017 10:31 AM

four members died in road accident in chittor

చిత్తూరు : చిత్తూరు జిల్లాలోని మదనపల్లె - పుంగనూరు రహదారిపై ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కంటైనర్ - మినీ బ‌స్సు ఢీకొనడంతో అక్కడికక్కడే నలుగురు మృతి చెందారు. మృతిచెందిన‌వారిని స్పెయిన్ దేశ‌స్తులుగా గుర్తించారు. ఇందులో ఓ మ‌హిళా టూరిస్టు కూడా ఉన్నారు. డ్రైవ‌ర్ కూడా అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు విడిచిన‌ట్లు పోలీసులు తెలిపారు. పుట్ట‌ప‌ర్తి నుంచి పుదుచ్చ‌రికి 11 మంది ప‌ర్యాట‌కులు మినీ బ‌స్సులో వెళ్తున్న‌ట్లు పోలీసులు తెలిపారు. మ‌ద‌న‌ప‌ల్లిలో మిష‌న‌రీ హాస్ప‌ట‌ల్‌ను ఉద‌యం 9 గంట‌ల‌కు సంద‌ర్శించిన త‌ర్వాత ప‌ర్యాట‌కు తిరుగు ప్ర‌యాణం అయ్యారు. కంటేన‌ర్‌ను సీజ్ చేసి దాని డ్రైవ‌ర్‌ను అరెస్టు చేశారు. నేష‌న‌ల్ హైవేపై ఈ ఘ‌ట‌న జ‌ర‌గ‌డంతో అక్క‌డ భారీగా ట్రాఫిక్ జామైంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంత‌పురం జిల్లాలో స్పెయిన్‌కు చెందిన ఓ ఎన్జీవో సంస్థ అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేప‌ట్టింది. ఆ ప‌నుల‌ను ప‌రిశీలించేందుకు స్పెయిన్ దేశ‌స్థులు ఇక్క‌డ‌కు వ‌చ్చారు. క్ష‌త‌గాత్రుల‌కు స‌రైన వైద్యాన్ని అందించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఆదేశాలు జారీ చేశారు. పోస్ట్‌మార్ట‌మ్ కూడా వేగంగా పూర్తి చేయ‌నున్నారు. మృతులు పరేజ్ మోరానో వీసెంటె(50), ఫ్రాన్సిస్కో పెడ్రోసా గిజోన్(31), మోరన్ మెలినిల్లో జోసెఫా(65), పెపాజ్ నవరో మరియా నైవేస్(62)లుగా గుర్తించారు.

1818
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS