రాత్రి వేళల్లోనూ మిలిటరీ ఆపరేషన్స్.. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ చేతికి చినూక్

Mon,March 25, 2019 01:09 PM

చండీగఢ్: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ బలం మరింత పెరిగింది. అత్యంత ఎత్తయిన ప్రదేశాల్లో, భారీ ఎత్తున సాయుధ బలగాలు, ఆయుధాలను మోసుకెళ్లగలిగే చినూక్ హెలికాప్టర్లు ఎయిర్‌ఫోర్స్ చేతికి చిక్కాయి. ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా చండీగఢ్‌లో వీటి రాకను ప్రకటించారు. తొలి విడతగా నాలుగు చినూక్ హెలికాప్టర్లు వచ్చాయి. ప్రస్తుతం ఇండియా ఎదుర్కొంటున్న వివిధ భద్రతా సవాళ్ల నేపథ్యంలో చినూక్‌లాంటి హెలికాప్టర్లు చాలా అవసరమని బీఎస్ ధనోవా అన్నారు. రాత్రి వేళల్లోనూ మిలిటరీ ఆపరేషన్స్ చేయగలిగే సత్తా ఈ చినూక్ హెలికాప్టర్ల సొంతం. వీటిలో మన భారత రక్షణ అవసరాలకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసినట్లు ధనోవా వెల్లడిచంఆరు. రాఫెల్ ఫైటర్ జెట్స్ ఎలాగైతే భారత రక్షణ రంగాన్ని పటిష్ట పరచనున్నాయో.. ఈ చినూక్ హెలికాప్టర్లు కూడా అంతేనని ఆయన స్పష్టం చేశారు. హిమాలయాల్లాంటి అత్యంత ఎత్తయిన ప్రదేశాలకు ఈ చినూక్ హెలికాప్టర్లు భారీ పేలోడ్స్‌ను మోసుకెళ్లగలవు. బోయింగ్ నుంచి ఆదివారమే ఈ నాలుగు హెలికాప్టర్లు ఇండియాకు వచ్చాయి. అత్యంత కఠినమైన పరిస్థితుల్లోనూ పరీక్షించిన తర్వాతే ఈ హెలికాప్టర్లను ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ చేతికి ఇచ్చారు. 19 దేశాలు ప్రస్తుతం ఈ చినూక్ హెలికాప్టర్లను వాడుతున్నాయి.


2821
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles