24 బంగారు బిస్కెట్లు స్వాధీనం

Wed,February 10, 2016 04:58 PM

Four arrested at Mumbai airport for smuggling gold

ముంబై : బంగారం స్మగ్లింగ్ చేస్తున్నారన్న ఆరోపణలపై ముంబైలోని ఛత్రపతి శివాజీ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు నలుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. అనుమానితుల నుంచి 24 గోల్డ్ బార్లను స్వాధీనం చేసుకున్నారు. వాటి బరువు సుమారు 2784 గ్రాములు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆ బంగారు బిస్కెట్ల విలువ 74 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. జెట్ ఎయిర్‌వేస్ విమానంలో దుబాయ్ నుంచి వచ్చిన షేక్ మొహ్మద్ అజ్మల్‌ను తనిఖీ చేయడంతో బంగారు కడ్డీలు బయటపడ్డాయి. ఎయిర్‌పోర్ట్ బయట అజ్మల్ కోసం ఎదురుచూస్తున్న రాగ్‌హిబ్ షేక్‌ను సెక్యూర్టీ అధికారులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఇద్దరు ఇచ్చిన సమాచారం మేరకు లైవ్-వెల్ గ్రౌండ్ స్టాఫ్‌కు చెందిన మరో ఇద్దర్ని అరెస్టు చేశారు.

1039
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles