శంకర్ ఐఏఎస్ అకాడమీ వ్యవస్థాపకుడు ఆత్మహత్య

Fri,October 12, 2018 03:45 PM

Founder of Shankar IAS Academy commits suicide in Chennai

చెన్నై : చెన్నైలోని శంకర్ ఐఏఎస్ అకాడమీ వ్యవస్థాపకుడు, సీఈవో శంకర్ దేవరాజన్(45) శుక్రవారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నారు. వ్యక్తిగత కారణాలతో ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకొని శంకర్ ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో పోలీసులు నిర్ధారించారు. 2004లో శంకర్ ఐఏఎస్ అకాడమీని శంకర్ చెన్నైలో నెలకొల్పారు. నాటి నుంచి నేటి వరకు శంకర్ అకాడమీ నుంచి 900 మందికి పైగా సివిల్స్ సర్వెంట్స్‌గా ఎంపికయ్యారు. శంకర్ మృతి వార్త తెలుసుకున్న సివిల్ సర్వెంట్స్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. కృష్ణగిరిలో ఓ రైతు కుటుంబంలో శంకర్ జన్మించారు. శంకర్ చిన్న తనంలోనే ఆయన తండ్రి మరణించారు. వయసు కారణంగా యూపీఎస్సీ ఎగ్జామ్స్‌కు అర్హత సాధించలేకపోయారు శంకర్. ఆ తర్వాత సివిల్స్‌కు ప్రిపేరయ్యే అభ్యర్థుల కోసం శంకర్ అకాడమీని ఏర్పాటు చేసి.. 900 మందికి పైగా సివిల్స్ సర్వెంట్స్‌గా తీర్చిదిద్దారు.

3853
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS