ప్ర‌ముఖ బ్యాంక‌ర్‌ మీరా స‌న్యాల్ క‌న్నుమూత‌

Sat,January 12, 2019 09:24 AM

Former RBS India Head and AAP politician Meera Sanyal passes Away

ముంబై: ఆమ్ ఆద్మీ పార్టీ నేత మీరా స‌న్యాల్ క‌న్నుమూశారు. ఆమె వ‌య‌సు 57 ఏళ్లు. అనారోగ్యం కార‌ణంగా ఆమె ప్రాణాలు విడిచారు. రాయ‌ల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్‌ల్యాండ్‌లో ఆమె చీఫ్ ఎగ్జిక్యూటీవ్‌గా ప‌నిచేశారు. ఆమె ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. 2014లో ఆప్ త‌ర‌పున లోక్‌స‌భ‌కు పోటీ చేశారు. ఓ చురుకైన ఆర్థిక‌వేత్త‌ను కోల్పోయామ‌ని ఢిల్లీ డిప్యూటీ సీఎం మ‌నీశ్ సిసోడియా త‌న ట్వీట్‌లో తెలిపారు. 30 ఏళ్ల పాటు బ్యాంకింగ్ కెరీర్‌లో ఉన్న ఆమె అనేక హోదాల్లో ప‌నిచేశారు. ఏబీఎన్ ఆమ్రోకు కూడా ఆమె ప‌నిచేశారు.

870
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles