మాజీ ఎమ్మెల్యే పుట్ట మ‌ధుకు ఘ‌న‌స్వాగ‌తం

Sat,September 8, 2018 11:23 AM

former mla putta madhu receives grand welcome

కమాన్ పూర్: పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలంలోని గొల్లపల్లి , గుండారం గ్రామాల్లో తాజా మాజీ ఎమ్మెల్యే పుట్టమధుకు ప్రజలు ,టిఆర్ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. టిఆర్ఎస్ నియోజకవర్గ అభ్యర్థిగా టీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్‌ పుట్ట మధు పేరు ప్రకటించిన అనంతరం తొలిసారిగా మంథని నియోజక వర్గానికి వస్తున్న నేపథ్యంలో మహిళలు మంగళ హారతులు, కోలాట నృత్యాలతో స్వాగతం పలికారు. గొల్లపల్లి నుండి టిఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమాన్‌పూర్‌ మండలంలోని టిఆర్ఎస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


పెద్దపెల్లి జిల్లా క‌మాన్‌పూర్‌ మండల కేంద్రంలో గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఆదివరహ స్వామి ఆలయంలో శనివారం ప్రభుత్వ విప్ కొప్పుల ఈశ్వర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

2163
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles