ఇస్రో మాజీ చైర్మన్‌ మాధవన్‌ నాయర్‌కు బెదిరింపులు

Sat,March 30, 2019 10:24 AM

Former ISRO Chairman G Madhavan Nair Gets Death Threat

తిరువనంతపురం : భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మాజీ చైర్మన్‌, బీజేపీ నాయకులు జి. మాధవన్‌ నాయర్‌కు బెదిరింపు లేఖ వచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీకి మద్దతు ఇవ్వొద్దని, ఒక వేళ మద్దతిస్తే నాయర్‌ను చంపేస్తామని లేఖలో పేర్కొన్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. ఈ లేఖ పాకిస్థాన్‌ కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న జైషే ఉగ్రవాద సంస్థ నుంచి వచ్చినట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. దీనిపై మాధవన్‌ నాయర్‌ను విలేకరులు ప్రశ్నించగా.. ఈ లేఖ గురించి తనకు తెలియదని చెప్పారు. అయితే దీనిపై నిఘా సమాచారం ఉన్నట్లు తనకు తెలిపారని పేర్కొన్నారు. మొత్తానికి నాయర్‌కు వచ్చిన బెదిరింపు లేఖపై కేరళ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఇస్రో చైర్మన్‌గా 2009లో మాధవన్‌ నాయర్‌ పదవీ విరమణ చేశారు. గతేడాది అక్టోబర్‌లో మాధవన్‌ బీజేపీలో చేరారు. మాధవన్‌ నాయర్‌కు భారత ప్రభుత్వం పద్మ భూషణ్‌, పద్మ విభూషణ్‌ పురస్కారాలను ప్రదానం చేసిన సంగతి తెలిసిందే.

1690
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles