కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా సుశీల్‌ చంద్ర బాధ్యతల స్వీకరణ

Fri,February 15, 2019 04:55 PM

Former IRS 1980 officer Sushil Chandra takes charge as the new Election Commissioner

న్యూఢిల్లీ : కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా సుశీల్‌ చంద్ర ఇవాళ బాధ్యతలను స్వీకరించారు. సీబీడీటీ చైర్మన్‌ సుశీల్‌ చంద్రను కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. సుశీల్‌ చంద్ర నియామకాన్ని ఆమోదిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. సుశీల్‌ చంద్ర 1980 బ్యాచ్‌కు చెందిన ఇండియన్‌ రెవెన్యూ సర్వీసెస్‌(ఆదాయ పన్ను విభాగం) అధికారి. కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో సుశీల్‌ చంద్ర కీలకపాత్ర పోషించారు.

కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ గా సునీల్ ఆరోరా, ఎన్నికల కమిషనర్ గా అశోక్ లాసా మాత్రమే ఉన్నారు. సుశీల్ చంద్ర ఎన్నికల కమిషనర్ గా ఇవాళ బాధ్యతలు స్వీకరించడంతో పూర్తిస్థాయి ఎన్నికల సంఘం ఏర్పడింది.2298
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles