33 ఏండ్లుగా కేవలం చాయ్ మీదే బ్రతకడం సాధ్యమా..?

Sat,January 12, 2019 04:32 PM

for more than 30 years she survive just on tea

ఛత్తీస్‌గఢ్‌లోని ఓ మహిళ గత 33 ఏండ్లుగా కేవలం చాయ్ తాగి బతుకుతున్నదట. కోరియా జిల్లా బరాడియా గ్రామానికి చెందిన పిల్లీదేవి వయసు ఇప్పుడు 44 సంవత్సరాలు. ఆమెకు 11 ఏండ్ల వయసప్పుడు ఆహార పదార్తాలు తీసలుకోవడం మానివేసిందిట. అప్పట్లో ఏదో స్కూల్ టోర్నమెంటుకు వెళ్లి వచ్చిన తరువాత ఆమెలో చాలా మార్పు వచ్చిందని కుటుంబసభ్యులు చెప్పారు. మొదట్లో కొన్నాళ్లపాటు చాయ్‌తో పాటుగా బిస్కిట్లు, బ్రెడ్ వంటివి తీసుకునేదట. తర్వాత అవీ మానేసి బ్లాక్‌టీ మాత్రమే, అదీ సూర్యాస్తమయం తర్వాత తీసుకుంటున్నదని ఆమె తండ్రి రతీరామ్ చెప్పారు. అందరూ ఆమెను చాయ్‌వాలీ చాచీ అని సరదాగా పిలుచుకుంటారట. ఆమెను అనేకమంది వైద్యులకు చూపిస్తే ఆరోగ్యంగానే ఉన్నదని చెప్పారని సోదరుడు బిహారీలాల్ వివరించారు. కానీ ఈ చాయ్ అలవాటు మర్మమేమిటో చెప్పలేక పోయారని అన్నారు. పిల్లీదేవి సాధారణంగా ఇంటి నుంచి బయటకు రాదు. నిరంతరం శివపూజలో నిమగ్నమై ఉంటుందని కుటుంబ సభ్యులు చెప్పారు. అయితే ఇలా చాయ్ మాత్రమే తాగి 33 ఏండ్లు గడపడం మీద వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మనుషులు చాయ్ మీద ఆధారపడి బతకడం సాధ్యం కాదని కోరియా జిల్లా ఆస్పత్రికి చెందిన డాక్టర్ ఎస్కే గుప్తా అభిప్రాయపడ్డారు. శాస్త్రపరంగా ఇది అసాధ్యమని పేర్కొన్నారు. ఏదో ఏడాదికోసారి ఉపవాసాలు చేయడం వరకు సరేగానీ ఇలా ఏండ్లతరబడి చాయ్ తాగుతూ బతకడం ఏమిటని ఆయన విస్మయం వ్యక్తం చేశారు. 33 ఏండ్లు బ్లాక్‌టీ తాగి ఎవరూ బతకలేరని ఆయన అన్నారు.

2104
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles