జానపద గాయకుడిపై పైసల వర్షం.. వీడియో

Fri,June 8, 2018 11:42 AM

Folk singer being showered with money at a devotional programme in Ahmedabad

అహ్మదాబాద్ : గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఓ జానపద గాయకుడిపై పైసల వర్షం కురిసింది. గురువారం సాయంత్రం జానపద గాయకుడు బ్రిజ్‌రాజ్ గాధ్వి సంగీత కచేరిని నిర్వహించాడు. గాధ్వి పాటలు పాడుతుండగా.. ఆయనపై డబ్బులు వెదజల్లారు. రూ. 10 నుంచి మొదలుకొని రూ. 500ల నోట్లను గాయకుడిపై వెదజల్లి.. తమ అభిమానాన్ని చాటుకున్నారు. బ్రిజ్‌రాజ్‌పై వెదజల్లిన పైసలు లక్షల్లో ఉంటాయి. ఈ సందర్భంగా గాయకుడు బ్రిజ్‌రాజ్ గాధ్వి మాట్లాడుతూ.. తాను పాటలు పాడటం ద్వారా వచ్చిన డబ్బును సామాజిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తుంటాను. అంతే కాకుండా కొన్ని స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇస్తానని తెలిపాడు. పలు సామాజిక కార్యక్రమాల కోసం తాను చేస్తున్న పని సంతృప్తిని ఇస్తుందన్నారు గాయకుడు.


2835
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles