మాల్యా ప్రైవేట్ జెట్ ఎంతకు అమ్ముడుపోయిందో తెలుసా?

Sun,July 1, 2018 03:58 PM

ముంబై: రెండేళ్లుగా సర్వీస్‌ట్యాక్స్ అధికారులు అమ్మడానికి ప్రయత్నిస్తున్న విజయ్ మాల్యా ప్రైవేట్ జెట్ మొత్తానికి అమ్ముడుపోయింది. అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన ఏవియేషన్ మేనేజ్‌మెంట్ సేల్స్ కేవలం రూ.34.8 కోట్లకు ఈ విమానాన్ని సొంతం చేసుకుంది. 2016 మార్చి నుంచి అధికారులు దీనిని అమ్మడానికి ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. మాల్యా తమకు బాకీ పడిన రూ.800 కోట్ల కోసం అతనికి సంబంధించిన వాటిని అమ్మకానికి పెడుతూ వస్తున్నది. ఈ లగ్జరీ ఎ319 జెట్‌ను కూడా ఇలాగే రెండేళ్ల కిందట అమ్మాలని చూసింది.

చివరికి ఈ-వేలం ద్వారా గత శుక్రవారం ఈ ప్రైవేట్ జెట్ అమ్ముడైంది. 2013 నుంచి ఈ జెట్ ప్లేన్ ముంబై ఎయిర్‌లోనే ఉంది. నిజానికి మొదట దీనిని అమ్మకానికి పెట్టిన సమయంలో రూ.152 కోట్ల కనిష్ఠ ధరను నిర్ణయించారు. అయితే ఒకే ఒక్క బిడ్డర్ మాత్రమే ముందుకు వచ్చాడు. అది కూడా కేవలం రూ.1.06 కోట్లు మాత్రమే కోట్ చేయడంతో ఆ బిడ్‌ను తిరస్కరించారు. ఆ తర్వాత కనీస ధరను పదిశాతం తగ్గించారు. డిసెంబర్ 2013లో ఈ ప్లేన్‌ను సర్వీస్ ట్యాక్స్ అధికారులు అటాచ్ చేశారు.

5175
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles