మాజీ కేంద్ర మంత్రి ఇంట్లోకి వ‌ర‌ద నీరు.. ర‌క్షించిన ద‌ళాలు

Sat,August 10, 2019 11:56 AM

flood water enters former union minister Janardhana Poojarys house

హైద‌రాబాద్‌: క‌ర్నాట‌క‌లో భీక‌రంగా వ‌ర్షాలు కురుస్తున్నాయి. దీంతో వ‌ర‌ద‌లు పోటెత్తుతున్నాయి. మంగుళూరుకు చెందిన మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ నేత బీ. జ‌నార్థ‌న్ పూజారే ఇంట్లోకి వ‌ర‌ద నీరు ప్ర‌వేశించింది. ద‌క్షిణ క‌న్న‌డ‌లోని బంట్వాల్‌లో మాజీ ఎంపీ ఇల్లు ఉన్న‌ది. అయితే నేత్రావ‌తి న‌ది తీవ్ర స్థాయిలో ఉప్పొంగుతున్న‌ది. 1974 త‌ర్వాత ఇంత స్థాయిలో నేత్రావ‌తి ఉప్పొంగుతున్న‌ట్లు ప్ర‌భుత్వ అధికారులు చెబుతున్నారు. 1974లోనూ నేత్రావ‌తి న‌ది నీళ్లు మాజీ ఎంపీ జ‌నార్థ‌న ఇంట్లోకి ప్ర‌వేశించిన‌ట్లు కొంద‌రు తెలిపారు. అయితే న‌దిలో నీరు ఇంట్లోకి ప్ర‌వేశించడంతో జ‌నార్థ‌న్ దాంట్లోనే చిక్కుకున్నాడు. ఎన్డీఆర్ఎఫ్ ద‌ళాలు వ‌చ్చి మాజీ ఎంపీని ఇంట్లో నుంచి తీసుకువ‌చ్చి ర‌క్షించారు. కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ఇవాళ క‌ర్నాట‌క వెళ్లారు. అక్క‌డ ఆమె వ‌ర‌ద ప‌రిస్థితిపై స‌మీక్ష చేప‌ట్ట‌నున్నారు. బెల్గావ్‌, బ‌గ‌ల్‌కోట్ జిల్లాల్లో ఆమె ప‌ర్య‌టించ‌నున్నారు. మాజీ సీఎం కుమార‌స్వామి బ‌గ‌ల్‌కోట్‌లో వ‌ర‌ద బాధితుల‌ను క‌లుసుకోనున్నారు.

1222
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles