ఫ్లిప్‌కార్ట్ సీఈవో పదవి నుంచి తప్పుకున్న బిన్నీ బన్సల్

Tue,November 13, 2018 05:45 PM

Flipkart CEO Binny Bansal resigns after personal misconduct allegations

న్యూఢిల్లీ: ఫ్లిప్‌కార్ట్ సీఈవో పదవి నుంచి తప్పుకున్నారు ఆ సంస్థ కో ఫౌండర్ బిన్నీ బన్సల్. వ్యక్తిగత ప్రవర్తన సరిగా లేదన్న ఆరోపణల నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయన రాజీనామాను వాల్‌మార్ట్ వెంటనే ఆమోదించింది. ఆరు నెలల కిందటే ఫ్లిప్‌కార్ట్‌లో మెజార్టీ వాటాను వాల్‌మార్ట్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. తనపై వచ్చిన ఆరోపణలపై బిన్నీ స్పందించిన తీరు సరిగా లేదని, పైగా విచారణ పారదర్శకంగా సాగాలన్న ఉద్దేశంతో ఆయన రాజీనామాను ఆమోదించినట్లు వాల్‌మార్ట్ వెల్లడించింది. ఫ్లిప్‌కార్ట్‌ను వాల్‌మార్ట్ కొనుగోలు చేసిన తర్వాత సచిన్ బన్సల్ తన పూర్తి వాటాను అమ్ముకొని వెళ్లిపోగా.. బిన్నీ బన్సల్ మాత్రం సీఈవోగా కొనసాగారు.

అయితే ఈ మధ్య కాలంలో ఆయన వ్యక్తిగత ప్రవర్తన సరిగా లేదన్న ఆరోపణలు వచ్చాయి. అయితే వీటిని బీన్నీ తీవ్రంగా ఖండించారు. ప్రస్తుతానికి పదవి నుంచి తప్పుకున్నా.. బోర్డులో తన సభ్యత్వాన్ని వదులుకుంటారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. వాల్‌మార్ట్ ఫ్లిప్‌కార్ట్‌ను కొనుగోలు చేసే సమయానికి బన్సల్స్‌కు చెరో 5 నుంచి 6 శాతం వాటా ఉంది. బినీ బన్సల్ వ్యక్తిగత ప్రవర్తన బాగా లేదన్న ఆరోపణలపై ఫ్లిప్‌కార్ట్, వాల్‌మార్ట్ స్వతంత్ర విచారణ జరిపించినట్లు వాల్‌మార్ట్ తన ప్రకటనలో వెల్లడించింది.

1490
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles