పెథాయ్ ఎఫెక్ట్: విమానాలు, రైళ్లు రద్దు

Mon,December 17, 2018 11:44 AM

విశాఖపట్టణం: కోస్తాఆంధ్రా తీరాన్ని గడగడలాడిస్తున్న పెథాయ్ తుపాన్ ప్రభావం విమానాలు, రైళ్ల రాకపోకలపై పడింది. దీంతో విశాఖ ఎయిర్‌పోర్ట్, రైల్వే స్టేషన్ నుంచి వెళ్లాల్సిన విమానాలు, రైళ్లను అధికారులు రద్దు చేశారు. విశాఖ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన దాదాపు 14 విమానాలు రద్దయ్యాయి. దీంతో విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో 700 మంది ప్రయాణికులు పడిగాపులు పడుతున్నారు. కొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. వాతావరణం అనుకూలించకపోవడంతో ఢిల్లీ-విశాఖ ఇండిగో విమానం హైదరాబాద్‌లో ల్యాండ్ అయింది. చెన్నై-వైజాగ్ విమానం వైజాగ్‌లో ల్యాండ్ అవలేక తిరిగి చెన్నై వెళ్లిపోయింది. హైదరాబాద్- వైజాగ్ స్పైస్ జెట్ విమానాన్ని కూడా అధికారులు రద్దు చేశారు.


ఒకవైపు విమానాలు, మరోవైపు రైళ్లు రద్దు కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. వైజాగ్ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఆహారం, తాగునీటిని రైల్వే అధికారులు ఏర్పాటు చేశారు.

2387
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles