ఐదు రాష్ర్టాలకు కొత్త గవర్నర్‌లు వీరే

Sat,September 30, 2017 11:07 PM

Five states get new governors Banwarilal Purohit for Tamil Nadu and Jagdish Mukhi for Assam


ఐదు రాష్ర్టాలకు కొత్త గవర్నర్‌లు వీరే
ఢిల్లీ: ఐదు రాష్ర్టాలకు, అండమన్ నికోబార్ దీవులకు లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌ను నియమిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు. తమిళనాడు గవర్నర్‌గా బన్వరీలాల్ పురోహిత్ నియమించబడ్డారు. పురోహిత్ గతంలో అసోం, మేఘాలయ రాష్ర్టాలకు గవర్నర్‌గా పని చేశారు. విదర్భ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. 1977లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి తన రాజకీయ జీవితం ప్రారంభించారు. మూడు సార్లు నాగ్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందారు. ప్రస్తుతం 1911లో గోపాలకృష్ణ గోఖలే స్థాపించిన హితవాద ఇంగ్లీష్ డెయిలీ న్యూస్ పేపర్‌కు మేనేజింగ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.

మేఘాలయ గవర్నర్‌గా గంగాప్రసాద్,

బీహార్ గవర్నర్‌గా సత్యపాల్ మాలిక్ ను నియమించారు. ఈయన కేంద్ర మంత్రిగా ఆరు నెలల పాటు, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. రెండు సార్లు రాజ్యసభకు, ఒకసారి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు.
అరుణాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా బీడీ మిశ్రాలను నియమించారు. ఈయన ఎన్‌ఎస్‌జీ కమాండోగా పనిచేశారు. 1993లో అమృత్‌సర్‌లో జరిగిన విమాన హైజాక్ అపరేషన్‌లో పాల్గొన్నారు. 1962 చైనా వార్‌లో, 1971 బంగ్లాదేశ్ లిబరేషన్ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. 1987-88లో శ్రీలంక ఎల్‌టీటీఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. కార్గిల్ వార్ అనంతరం వాలంటరి రిటైర్‌మెంట్ తీసుకున్నారు.

అండమన్ నికోబార్ దీవులకు లెఫ్టినెంట్ గవర్నర్‌గా రిటైర్డ్ అడ్మిరల్ దేవేంద్రకుమార్ జోషిని నియమించారు. ఈయన 2012 నుంచి 2014 వరకు చీఫ్ నావెల్ స్టాఫ్‌గా పనిచేశారు. 1996 నుంచి 1999 వరకు సింగపూర్ ఇండియన్ హైకమిషన్‌లో డిఫెన్స్ అడ్వైజర్‌గా పనిచేశారు.

అంతకు ముందు ఈ దీవులకు లెఫ్టినెంట్ గవర్నర్‌గా పనిచేసిన ప్రొఫెసర్ జగ్దీశ్ ముఖిని అసోం గవర్నర్‌గా నియమించారు.

2430
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles