త‌మిళ హోట‌ళ్ల‌పై ఐటీ దాడులు

Thu,January 3, 2019 01:22 PM

Five restaurant chains including Saravana Bhavan raided in Chennai

చెన్నై: త‌మిళ‌నాడులు అయిదు హోట‌ల్ గ్రూపుల‌పై ఇవాళ ఆదాయ‌ప‌న్ను శాఖ దాడులు నిర్వ‌హిస్తున్న‌ది. ప్ర‌ముఖ హోట‌ల్ సంస్థ శ‌ర‌వ‌ణ భ‌వ‌న్‌తో పాటు ఇత‌ర గ్రూపుల‌పై చెన్నైతో పాటు ఇత‌ర ప్రాంతాల్లో ఐటీశాఖ సోదాలు చేస్తోంది. మొత్తం 32 ప్ర‌దేశాల్లో దాడులు జ‌రుగుతున్న‌ట్లు తెలుస్తోంది. ప‌న్నులు ఎగ‌వేశార‌న్న ఆరోప‌ణ‌ల‌పై ఈ దాడులు జ‌రుగుతున్నాయి. సుమారు 100 మంది ఐటీ అధికారులు ఈ దాడుల్లో పాల్గొన్నారు.

శ‌ర‌వ‌ణ భ‌వ‌న్‌తో పాటు గ్రాండ్ స్వీట్స్‌, హాట్ బ్రెడ్స్‌, అంజాపుర్ గ్రూపుల‌పై ఈ దాడులు జ‌రుగుతున్నాయి. రెస్టారెంట్ గ్రూపుల‌కు సంబంధించిన డైర‌క్ట‌ర్ల ఇండ్ల‌ల్లో కూడా సోదాలు సాగుతున్నాయి. గ‌త కొన్నేళ్లుగా ఈ హోట‌ళ్లు ప‌న్ను ఎగ‌వేత‌కు పాల్ప‌డుతున్న‌ట్లు త‌మ ద‌గ్గ‌ర ఆధారాలు ఉన్నాయ‌ని ఓ ఐటీ అధికారి వెల్ల‌డించారు. శ‌ర‌వ‌ణ భ‌వ‌న్ హోట‌ల్‌కు ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. ఆ గ్రూపుకు దేశ‌వ్యాప్తంగా బ్రాంచీలు ఉన్నాయి. న్యూయార్క్‌, లండ‌న్‌, పారిస్‌, సింగ‌పూర్ లాంటి సిటీల్లోనూ శ‌ర‌వ‌ణ భ‌వ‌న్‌కు శాఖ‌లు ఉన్నాయి.

1202
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles