స‌ర్జిక‌ల్ ఆప‌రేష‌న్ ఇలా సాగింది..

Thu,February 9, 2017 11:21 AM

five majors involved in surgical strikes

హైద‌రాబాద్: గ‌త ఏడాది సెప్టెంబ‌ర్ 29న భార‌త భ‌ద్ర‌తా ద‌ళాలు స‌రిహ‌ద్దు రేఖ వ‌ద్ద పాక్ ఆక్ర‌మిత్ క‌శ్మీర్‌లో స‌ర్జిక‌ల్ దాడులు చేశారు. ఆ ర‌హ‌స్య ఆప‌రేష‌న్ ఎలా సాగింద‌న్న వాస్త‌వాలు బ‌య‌ట‌కు రాలేదు. కానీ ఇటీవ‌ల గ‌ణ‌తంత్ర దినోత్స‌వ ప‌రేడ్‌లో మాత్రం కొంద‌రు పారా క‌మాండోలు పాల్గొన్నారు. అత్యంత సాహాసోపేతంగా సాగిన స‌ర్జిక‌ల్ ఆప‌రేష‌న్‌లో సుమారు 19 మంది పారా సైనికులు పాల్గొన్నట్లు సమాచారం. ఒక క‌ల్న‌ర్‌, అయిదుగురు మేజ‌ర్లు, ఇద్ద‌రు కెప్టెన్లు, ఇద్ద‌రు నైబ్ సుబేదార్లు, ముగ్గురు హ‌వ‌ల్‌దార్లు, ఓ లాన్స్ నాయ‌క్‌తో పాటు నాలుగు మంది పారా ట్రూప‌ర్లు స‌ర్జిక‌ల్ దాడిలో పాల్గొన్నారు. వీళ్లంతా పారా రెజిమెంట్‌లోని 4వ‌, 9వ బెటాలియ‌న్‌కు చెందిన‌ క‌మాండోలు.

రిపబ్లిక్ డే రోజున 4వ పారా ద‌ళానికి చెందిన మేజ‌ర్ రోహిత్ సూరికి కీర్తి చ‌క్ర‌ను అందచేశారు. అదే ద‌ళానికి చెందిన క‌ల్న‌ల్ హ‌ర్‌ప్రీత్ సందూకు యుద్ సేవా మెడ‌ల్‌తో స‌త్క‌రించారు. పారా రెజిమెంట్‌లోని 4వ బెటాలియ‌న్‌కు మొత్తం నాలుగు శౌర్య‌చ‌క్ర‌లు, 13 సేవా మెడ్స‌ల్ వ‌చ్చాయి. రెండు ల‌క్షాలను ఏక‌కాలంలో స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొన్న క‌ల్న‌ల్ హ‌ర్‌ఫ్రీత్‌కు యుద్ సేవా మెడ‌ల్‌ను ఇచ్చారు. దాడికి సంబంధించిన ప్ర‌ణాళిక‌ను అత్యంత ప‌క‌డ్బందీగా నిర్వ‌హించాడు క‌ల్న‌ల్ హ‌ర్‌ప్రీత్‌.

క‌శ్మీర్‌లో యూరీ దాడి జ‌రిగిన త‌ర్వాత భార‌త ఆర్మీ స‌ర్జిక‌ల్ దాడుల‌కు ప్ర‌ణాళిక వేసింది. అయితే అమావాస్య రోజున ఈ ఆప‌రేన్ నిర్వ‌హించాల‌ని అనుకున్నారు. అమాస్య రోజున వెన్న‌ల ఉండ‌దు క‌నుక ఆప‌రేష‌న్ సులువుగా సాగుతుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. దీంతో సెప్టెంబ‌ర్ 29న‌ మేజ‌ర్ రోహిత్ సూరీ నేతృత్వంలోని ఎనిమిది మంది స‌భ్యుల బృందం స‌ర్జిక‌ల్ దాడుల‌కు వెళ్లింది. ఆప‌రేష‌న్‌కు సంబంధించిన రెక్కీ వేసిన మేజ‌ర్ సూరి ఆ త‌ర్వాత త‌న టీమ్‌ను ఆదేశించాడు. మొదట కేవ‌లం 50 మీటర్ల దూరం నుంచే ఇద్ద‌రు ఉగ్ర‌వాదుల‌ను హ‌తం చేశారు. అదే స‌మ‌యంలో మ‌రో ఇద్ద‌రి ఉగ్ర‌వాదుల క‌ద‌లిక‌ల‌ను గుర్తించిన సూరి, త‌న ప్రాణాల‌ను లెక్క చేయ‌కుండా ఒంట‌రిగా ముందుకువెళ్లి వాళ్ల‌ను హ‌త‌మార్చాడు.

అయితే లాంచ్‌ప్యాడ్‌ల వ‌ద్ద నిఘా పెట్టేందుకు ఒక మేజ‌ర్‌ను నియ‌మించారు. ఆప‌రేష‌న్ కంటే 48 గంటల ముందే స‌రిహ‌ద్దు రేఖ దాటిన అత‌ను ఉగ్ర‌వాద క‌ద‌లిక‌ల‌పై నిఘా పెట్టాడు. ఆ మేజ‌ర్‌కు చెందిన టీమ్ టార్గెట్ జోన్ల‌పై రెక్కీ వేసింది. త‌మ స్ట్ర‌యిక్ టీమ్‌కు కావాల్సిన అనువైన ప్రాంతాల‌ను కూడా ఆ మేజ‌ర్ బృందం ముందే నిర్ణ‌యించింది. ఉగ్ర‌వాదులు వాడుకుంటున్న ఓ ష‌ల్ట‌ర్‌ను ఆ మేజ‌ర్ ధ్వంసం చేశాడు. త‌మ బృందానికి ప్రాణ ముప్పు ఉంద‌ని తెలుసుకున్న ఆ మేజ‌ర్ శ‌త్రు స్థావ‌రాన్ని పూర్తిగా ధ్వంసం చేశాడు.

ఈ ఆప‌రేష‌న్‌లో మూడ‌వ మేజ‌ర్ కూడా చాక‌చ‌క్యంగా వ్య‌వ‌హ‌రించాడు. ఓ షెల్ట‌ర్‌లో నిద్రిస్తున్న జిహాదీల‌ను చంపేసిన ఆ మేజ‌ర్ త‌న బృందాన్ని సుర‌క్షిత ప్రాంతానికి తీసుకెళ్లాడు. భార‌త ప్ర‌భుత్వం ఆ మేజ‌ర్‌కు శౌర్య చ‌క్ర‌ను ప్ర‌దానం చేసింది. అయితే దాడి జ‌రుగుతున్న క్ర‌మాన్ని అత‌ను ఎప్ప‌టిక‌ప్పుడూ త‌న సీనియ‌ర్ల‌కు తెలియ‌జేస్తూ ముందుకువెళ్లాడు.

ఇదే దాడిలో నాలుగ‌వ మేజ‌ర్ శత్రువుల‌కు చెందిన ఆటోమెటిక్ వెప‌న్ స్థావ‌రాన్ని ధ్వంసం చేశాడు. గ్రేనేడ్ దాడుల‌తో ఉగ్ర‌స్థావ‌రాల‌పై విరుచుకుప‌డ్డాడు. ఆ దాడిలో ఇద్ద‌రు ఉగ్ర‌వాదులు హ‌త‌మ‌య్యారు. ఆ మేజ‌ర్‌కు సేనా మెడ‌ల్‌ను ప్ర‌దానం చేశారు. మొత్తం మీద స‌ర్జిక‌ల్ దాడి అంత ఈజీ ఆప‌రేష‌న్ కాద‌ని అధికారులు తెలిపారు. ఆ ఆప‌రేష‌న్ నిర్వ‌హిస్తున్న‌ప్పుడు ఉగ్ర‌వాదుల నుంచి తీవ్ర ప్ర‌తిస్పంద‌న ఎదురైంద‌న్నారు.

అయిద‌వ మేజ‌ర్ కూడా ముగ్గురు ఉగ్ర‌వాదుల‌ను హ‌త‌మార్చాడు. నాలుగ‌వ మేజ‌ర్ బృందంపై రాకెట్ గ్రేనేడ్ల‌తో దాడి చేసేందుకు ప్ర‌య‌త్నించిన ముగ్గురు ఉగ్ర‌వాదుల‌ను అయిద‌వ మేజ‌ర్ హ‌త‌మార్చాడు. ఉగ్ర బృందంపై దూకుడుగా వెళ్తూ వాళ్ల‌ను తుద‌ముట్టించాడు. స‌ర్జిక‌ల్ దాడి ఆప‌రేష‌న్‌లో ఒక్క సైనికుడు కూడా మృతిచెంద‌లేదు. అయితే నిఘా టీమ్‌కు చెందిన ఓ పారాట్రూప‌ర్ మాత్రం గాయ‌ప‌డ్డాడు. ఇవాళ ఓ ప్ర‌ధాన ఆంగ్ల ప‌త్రిక‌ స‌ర్జిక‌ల్ దాడిపై ఈ క‌థనాన్ని ప్ర‌చురించింది.

3852
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles