వ్యక్తిని అరెస్ట్ చేసేందుకెళ్లిన పోలీసులపై రాళ్ల దాడి

Thu,October 11, 2018 05:26 PM

Five cops injured after villagers pelt stones

ముజఫర్‌నగర్: బాలికను వేధించిన వ్యక్తిని అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులపై గ్రామస్థులు రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటన యూపీలోని ముజఫర్‌నగర్ జిల్లా బుధానా పట్టణ పరిధిలో జరిగింది. రాళ్ల దాడిలో ఐదుదురు పోలీసులకు గాయాలయ్యాయి. ఘర్షణకు కారణమైన 100 మందిపై కేసు నమోదు చేసి..దర్యాప్తు కొనసాగిస్తున్నామని ఎస్పీ అలోక్ శర్మ తెలిపారు. బాధిత బాలిక కుటుంబసభ్యులపై దాడికి దిగిన ఏడుగురిపై కూడా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ముందు జాగ్రత్తగా ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు చెప్పారు.

1047
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles