దేశ‌వ్యాప్తంగా అనుకూల ప‌వ‌నాలు: ప్ర‌ధాని మోదీ

Fri,April 26, 2019 11:06 AM

First time pro incumbency wave in country, says PM Modi

హైద‌రాబాద్‌: దేశ‌వ్యాప్తంగా ప్ర‌భుత్వ అనుకూల ప‌వ‌నాలు వీస్తున్నాయ‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ తెలిపారు. ఇవాళ వార‌ణాసిలో ఆయ‌న కార్య‌క‌ర్త‌ల‌తో మాట్లాడారు. దేశంలో మొట్ట‌మొద‌టి సారి ప్ర‌భుత్వ అనుకూల ప‌వ‌నాలు వీస్తున్నాయ‌న్నారు. క‌శ్మీర్ నుంచి క‌న్యాకుమారి వ‌ర‌కు ఉత్స‌వ వాతావ‌ర‌ణం నెల‌కొన్న‌ద‌న్నారు. పార్టీ వ‌ర్క‌ర్లంతా నిజ‌మైన కార్య‌క‌ర్త‌ల‌న్నారు. సుప‌రిపాల‌న కోసం ఎంతో హుందాగా ప‌నిచేసినట్లు మోదీ తెలిపారు. మ‌ళ్లీ మోదీ స‌ర్కార్‌ను గెలిపించాల‌న్న గ‌ట్టి ఉద్దేశంతో ప్ర‌జ‌లు ఉన్నార‌న్నారు. గురువారం జ‌రిగిన రోడ్ షోలో కార్య‌క‌ర్త‌ల క‌ష్టాన్ని గుర్తించాన‌న్నారు. కార్య‌క‌ర్త‌ల‌తో స‌మావేశం త‌ర్వాత ఆయ‌న కాల‌భైర‌వ ఆల‌యంలో పూజ‌లు చేశారు. అనంత‌రం నామినేష‌న్ వేసేందుకు కలెక్ట‌ర్ ఆఫీసుకు బ‌య‌లుదేరి వెళ్లారు.

1029
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles