పెళ్లి చేసుకున్న బ్యూటిఫుల్‌ ఎంపీ

Thu,June 20, 2019 03:23 PM

First Time Lawmaker Nusrat Jahan Gets Married In Turkey

పార్లమెంట్‌లో తొలిసారి అడుగుపెట్టిన బెంగాలీ నటి, తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ నుష్రత్‌ జహాన్‌(26) పెళ్లి చేసుకున్నారు. తన ప్రియుడు నిఖిల్‌ జైన్‌(వ్యాపారవేత్త)ను పెళ్లి చేసుకుంది నుష్రత్‌ జహాన్‌. టర్కీలో అంగరంగ వైభవంగా జరిగిన ఈ వివాహ వేడుకకు నుష్రత్‌, నిఖిల్‌ కుటుంబ సభ్యులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. ఈ సందర్భంగా నుష్రత్‌ జహాన్‌ తన పెళ్లి ఫోటోను ట్విట్టర్‌లో షేర్‌ చేస్తూ.. నిఖిల్‌ జైన్‌తో కలిసి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు ట్వీట్‌ చేశారు. జులై 4వ తేదీన కోల్‌కతాలో రిసెప్షన్‌ ఉండే అవకాశం ఉంది.

పశ్చిమ బెంగాల్‌లోని బషీరత్‌ నియోజకవర్గం నుంచి తృణమూల్‌ కాంగ్రెస్‌ తరపున నుష్రత్‌ జహాన్‌ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. నుష్రత్‌ 3.5 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక నుష్రత్‌ స్నేహితురాలు మిమి చక్రవర్తి కూడా టీఎంసీ తరపున లోక్‌సభకు ఎన్నికైన విషయం విదితమే. వీరిద్దరూ ప్రత్యేక దుస్తుల్లో ఇటీవలే పార్లమెంట్‌కు వచ్చి అందరి దృష్టిని ఆకర్షించారు. అయితే నుష్రత్‌ పెళ్లి కారణంగా వీరిద్దరూ ఇంకా ఎంపీలుగా ప్రమాణస్వీకారం చేయలేదు.


3833
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles