మ‌న రాఫెల్‌ యుద్ధ విమానం ఇలా ఉంటుంది.. వీడియో

Tue,November 13, 2018 01:00 PM

First look of the Rafale jet for the Indian Air Force, from the Istre-Le Tube airbase in France

పారిస్: భార‌త వైమానిక ద‌ళం కొనుగోలు చేసే రాఫెల్ యుద్ధ విమానాన్ని ఫ్రాన్స్ ఆవిష్క‌రించింది. మొత్తం 36 రాఫెల్ జెట్ల‌ను కొనుగులు చేసేందుకు ఫ్రాన్స్‌కు చెందిన డ‌సాల్ట్ కంపెనీతో భార‌త్ ఒప్పందం కుదుర్చుకున్న విష‌యం తెలిసిందే. వైమానిక రంగంలో రాఫెల్ అత్యంత ఆధునిక యుద్ధ విమానం. ఫ్రాన్స్‌లోని ఇస్ట్రి లీ ట్యూబ్ ఎయిర్‌బేస్‌లో ఇవాళ రాఫెల్ విమానాన్ని ప్ర‌ద‌ర్శించారు. ఎయిర్‌బేస్ ర‌న్‌వేపై ఆ విమానం ఎగిరింది. ఇలాంటి యుద్ధ విమానాల‌నే ఇప్పుడు భార‌త్‌లో రిల‌య‌న్స్ సంస్థ స‌హ‌కారంతో త‌యారు చేయ‌నున్నారు. ఆ త‌యారీ కోసం జ‌రిగిన ఒప్పందంలో భారీ అవినీతి చోటుచేసుకున్న‌ట్లు కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న‌ది. అయితే రిల‌య‌న్స్‌ను తామే ఎంచుకున్నామ‌ని, ఇందులో అబ‌ద్ధం ఏమీలేద‌ని యుద్ధ విమానాల‌ను త‌యారు చేసే డ‌సాల్ట్ సంస్థ సీఈవో ఎరిక్ ట్రాపియ‌ర్ తెలిపారు. న‌ష్టాల్లో ఉన్న రిల‌య‌న్స్ సంస్థ‌కు డ‌సాల్ట్ కంపెనీ 284 కోట్లు ఇచ్చింద‌ని, ఆ డ‌బ్బుతోనే అంబానీ సంస్థ భూమి కొనుగోలు చేసింద‌ని, అక్క‌డే రిల‌య‌న్స్ డిఫెన్స్ సంస్థ‌ను ఏర్పాటు చేస్తున్నార‌ని రాహుల్ గాంధీ ఆరోపించారు. డ‌సాల్ట్ కంపెనీ అబ‌ద్ధం చెబుతున్న‌ద‌ని, ఒక‌వేళ విచార‌ణ మొద‌లైతే, ఆ కేసులో మోదీ ఇరుక్కుంటార‌ని రాహుల్ హెచ్చ‌రించారు. దీంతో ఇవాళ మీడియాతో మాట్లాడిన డ‌సాల్ట్ సీఈవో.. రాహుల్ ఆరోప‌ణ‌ల్లో వాస్త‌వం లేద‌ని, తాను అబద్దం ఆడ‌డం లేద‌న్నారు.

1522
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles