2 కి.మీ. దూరానికి 45 నిమిషాలు తీసుకున్న ఫైర్‌ ఇంజిన్లు

Sat,May 25, 2019 12:16 PM

సూరత్‌: గుజరాత్‌ రాష్ట్రంలోని సూరత్‌లో గల నాలుగంతస్తుల భవనంలో నిన్న భారీ అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. కోచింగ్‌ సెంటర్‌లో చెలరేగిన మంటల్లో చిక్కుకుని 20 మంది విద్యార్థులు మృతిచెందగా మరో 20 మంది గాయపడ్డారు. వీరిలో ఇద్దరు వెంటిలేటర్‌పై ఉన్నారు. మరో ఐదుగురు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఘటనకు బాధ్యులుగా పేర్కొంటూ పోలీసులు ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. కోచింగ్‌ సెంటర్‌ యజమానిని అరెస్ట్‌ చేశారు. కాగా ప్రత్యక్ష సాక్ష్యుల కథనం ప్రకారం సమాచారం అందిన 45 నిమిషాల తర్వాత గానీ అగ్నిమాపకశాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకోలేదని పేర్కొంటున్నారు. ప్రమాద స్థలం నుంచి ఫైర్‌ స్టేషన్‌ కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రమాద స్థలానికి చేరుకోవడానికి 45 నిమిషాల సమయం తీసుకున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. సకాలంలో వచ్చి ఉంటే మరికొందరిని రక్షించేవారని తమ ఆవేదనను వెలిబుచ్చుతున్నారు.

2351
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles