హౌరా బ్రిడ్జికి సమీపంలో భారీ అగ్నిప్రమాదం

Sat,June 8, 2019 10:10 AM

Fire breaks out at a chemical godown near Jagannath Ghat in Kolkata

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని హౌరా బ్రిడ్జికి సమీపంలో ఇవాళ ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. జగన్నాథ్ ఘాట్ వద్ద ఉన్న ఓ కెమికల్ గోడౌన్‌లో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది 20 ఫైరింజన్లతో మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తోంది. మంటలను అదుపు చేసేందుకు మరింత సమయం పడుతుందని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. గోడౌన్‌లోకి వెళ్లేందుకు ఇబ్బందిగా మారిందన్నారు. గోడౌన్‌లోని మధ్య భాగం పూర్తిగా కాలిపోయిందని చెప్పారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.1349
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles