కంప్యూట‌ర్ బాబాపై ఎఫ్ఐఆర్ న‌మోదు

Thu,May 16, 2019 11:16 AM

FIR registered against Computer Baba for violating model code of conduct

హైద‌రాబాద్‌: భోపాల్‌లో కాంగ్రెస్ అభ్య‌ర్థి దిగ్విజ‌య్ సింగ్ విజ‌యం కోసం ప్ర‌ముఖ హిందూ సాధువు కంప్యూట‌ర్ బాబా భారీ యజ్ఞాన్ని నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌లో మ‌ధ్య‌ప్ర‌దేశ్ పోలీసులు కంప్యూట‌ర్ బాబాపై ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు. ఎన్నిక‌ల నియ‌మావ‌ళిని ఉల్లంఘించార‌ని ఆయ‌నపై కేసు ఫైల్ చేశారు. కంప్యూట‌ర్ బాబా హ‌ట‌యోగా కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. దీంతో ఎన్నిక‌ల సంఘం బాబా య‌జ్ఞంపై ద‌ర్యాప్తు ప్రారంభించింది. లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో దిగ్విజ‌య్ గెల‌వాల‌ని ఓ మైదానంలో కంప్యూట‌ర్ బాబా య‌జ్ఞం ప్రారంభించాడు. జిల్లా క‌లెక్ట‌ర్‌తో పాటు జిల్లా ఎన్నిక‌ల అధికారి సుదామా ఖ‌డే దీనిపై ద‌ర్యాప్తు నిర్వ‌హించారు. బీజేపీ ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు విచార‌ణ జ‌రిగింది. కంప్యూట‌ర్ బాబా ఎవ‌రి నుంచి య‌జ్ఞం కోసం అనుమ‌తి తీసుకున్నార‌ని, ఎప్పుడు ఆ అనుమ‌తి ల‌భించింద‌న్న కోణంలో ద‌ర్యాప్తు జ‌రిగింది. కంప్యూట‌ర్ బాబా ఏ పార్టీ త‌ర‌పున ప్ర‌చారం చేస్తున్నార‌ని కూడా ఈసీ తెలుసుకున్న‌ది.

1090
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles