పోలీసులు గ్రామ పెద్దను ఫారెస్ట్‌కు తీసుకెళ్లి..

Wed,December 11, 2019 02:51 PM


బరేలి: గ్రామ పెద్దను బెదిరించి డబ్బులు వసూలు చేసిన ఐదుగురు పోలీసులపై కేసు నమోదైంది. ఢాకియా గ్రామ పంచాయతీ పెద్ద ఛత్రపాల్ డిసెంబర్ 8న కారులో తన ఇంటికి వెళ్తుండగా..ఐదుగురు పోలీసులు అతన్ని ఆపారు. కారులో తనిఖీలు చేయగా..అందులో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదు. దీంతో పోలీసులు ఛత్రపాల్‌ను అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లారు. అతియా ఫారెస్ట్ ప్రాంతంలో ఛత్రపాల్‌కు తెలియకుండా కారులో నార్కోటిక్ డ్రగ్స్‌ను పెట్టి పోలీసులు వీడియో తీశారు. నకిలీ కేసు పెట్టి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. రూ.7 లక్షలు ఇస్తేనే జైలు నుంచి విడుదల చేస్తామని అతన్ని హెచ్చరించడంతో ఛత్రపాల్‌ డబ్బులు ఇచ్చేశాడు.


ఆ తర్వాత ఛత్రపాల్ ఐదుగురు పోలీసులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తూ ఓ లేఖ రాశాడు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన అనంతరం ఎస్‌ఐలు నితిన్ శర్మ, ముఖేశ్‌కుమార్, కానిస్టేబుళ్లు దేవేంద్రకుమార్, ధనుంజయ్‌తోపాటు హోంగార్డుపై కేసు నమోదు చేసి..వారిని సస్పెండ్ చేశామని ఎస్‌ఎస్పీ శైలేశ్ పాండే తెలిపారు.

2588
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles