కోడెల సహా 22 మందిపై కేసు నమోదు

Tue,April 16, 2019 07:14 PM

FIR has been registered on Kodela and other 22 TDP leaders

గుంటూరు: ఏపీ శాసనసభ స్పీకర్, సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కోడెల శివప్రసాద్ రావుపై గుంటూరు జిల్లా రాజుపాలెం పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్ఐఆర్‌ నమోదైంది. పోలింగ్ సందర్భంగా రాజుపాలెం మండలం ఇనుమెట్ల గ్రామంలో కోడెల సృష్టించిన అరాచకాలపై చర్యలు తీసుకోవాలని వైఎస్‌ఆర్‌సీపీ నేతలు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో కోడెల సహా మరో 22 మందిపై రాజుపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలింగ్ రోజు ఇనుమెట్ల పోలింగ్ బూత్‌లోకి కోడెల చొరబడిన విషయం తెలిసిందే. పోలింగ్ రోజు బూత్ పరిసరాల్లో కోడెల తీరుతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తన చొక్కా తానే చించుకుని వైసీపీ కార్యకర్తలు తనపై దాడి చేశారంటూ ఫిర్యాదు చేశారు. దీంతో సత్తెనపల్లి వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబు సహా పలువురిపై పోలీసులు అక్రమ కేసులు పెట్టారు.

3980
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles