ఎమ్మెల్యే, అధికారికి మధ్య వాగ్వాదం..వీడియో

Sun,September 8, 2019 03:20 PM

పంజాబ్: ప్రభుత్వ అధికారి పట్ల దురుసుగా ప్రవర్తించిన ఘటనలో లోక్ ఇన్సాఫ్ పార్టీ ఎమ్మెల్యే సిమ్రన్ జీత్ సింగ్ పై కేసు నమోదైంది. గురుదాస పూర్ డిప్యూటీ కమిషనర్ విపుల ఉజ్వల్ పై ఎమ్మెల్యే సిమ్రన్ జీత్ సింగ్ మాటలతో విరుచుకుపడ్డారు. ఎస్‌డీఎం బీఆర్ సింగ్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు. దీనిపై ఎమ్మెల్యే సిమ్రన్ జీత్ సింగ్ మాట్లాడుతూ..బటాలా టపాకాయల గోదాం అగ్నిప్రమాద బాధితుల పట్ల డీసీ విపుల్ ఉజ్వల్ దురుసుగా ప్రవర్తించారు. ప్రజల తరపున వారి విజ్ఞప్తిని చెప్పేందుకు డిప్యూటీ కమిషనర్ విపుల్ ఉజ్వల్ దగ్గరకు వెళ్లినట్లు చెప్పారు. ప్రజలకు సంబంధించి ప్రభుత్వం అందించే సాయం విషయంలో అవినీతికి వ్యతిరేకంగా తన గళం వినిపిస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సిమర్జిత్ అన్నారు.
3657
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles